Uttarakhand : ఉత్తరాఖండ్​లో ఏం జరిగింది.. కర్ఫ్యూ ఎందుకో తెలుసా?

Uttarakhand : ఉత్తరాఖండ్​లో ఏం జరిగింది.. కర్ఫ్యూ ఎందుకో తెలుసా?

సున్నిత అంశాలపై ఉత్తరాఖండ్ లో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిపోయాయి. ఇటు కేంద్రం, అటు రాష్ట్ర ప్రభుత్వాలు హై అలర్ట్ అయ్యాయి. ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) హల్ద్వానీలో చెలరేగిన హింస తీవ్ర ఉద్రిక్తతలను రేపింది. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన మదర్సా, మసీదు కూల్చివేత సమయంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి.

హల్ద్వానీ హింసాత్మక ఘటనలో ఆరుగురు ఆందోళనకారులు మరణించినట్టు సమాచారం. ఐతే.. అధికారిక సమాచారం ప్రకారం ఇద్దరు మరణించారు. మరో నలుగురికి సీరియస్ గా ఉందని తెలుస్తోంది. ఈ కౌంట్ పెరిగే చాన్సుంది. మరో 300 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల ప్రొటెక్షన్ తో మదర్సాను కూల్చివేయడానికి వచ్చిన మున్సిపల్​ కార్మికులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. కంట్రోల్ చేసేందుకు పోలీసులు కాల్పులు జరిగారు. ఈ క్రమంలోనే హింస చెలరేగింది. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రాళ్ల దాడిలో వందల మంది గాయపడ్డారు.

హల్ద్వానీలో బన్‌భూల్‌పుర ప్రాంతం ఉంది. ప్రభుత్వ స్థలంలో కొందరు అక్రమంగా మదర్సా, మసీదు కట్టారు. వీటిని తీసేయాలని గతంలో నిర్వాహకులకు నోటీసు ఇచ్చారు. మసీదు యాజమాన్యం స్పందించలేదు. అధికారులు కోర్టుకు వెళ్లి కూల్చివేత ఆర్డర్స్ తెచ్చుకున్నారు. పోలీసు బందోబస్తు మధ్య మదర్సా, మసీదుల కూల్చివేసేందుకు ప్రయత్నించారు. వారిని లోకల్ వాసులు అడ్డుకుని నిరసన తెలిపారు. అధికారులు బుల్డోజర్ తో మదర్సాను కూల్చివేయించడంతో ఆందోళనకారులు వారిపై రాళ్లు రువ్వారు. పోలీస్ సెక్యూరిటీ పెంచి, మతపెద్దలతో సంప్రదించి పరిస్థితి కంట్రోల్ లోకి తెచ్చేందుకు ప్రభుత్వ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story