Karnataka : మాండ్యలో ప్రస్తుత పరిస్థితి ఇదీ.. వినాయక నిమజ్జనంలో ఘర్షణ

Karnataka : మాండ్యలో ప్రస్తుత పరిస్థితి ఇదీ.. వినాయక నిమజ్జనంలో ఘర్షణ
X

కర్ణాటకలోని మాండ్యలో వినాయక నిమజ్జన ఘర్షణ ఉద్రిక్తతలు రేపింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా అల్లర్లు చోటుచేసుకున్నాయి. రాళ్లు రువ్వడం, విధ్వంసం సృష్టించడం వంటి ఘటనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పలు దుకాణాలు, వాహనాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌ కు చేరుకొని పరిస్థితి కంట్రోల్‌ చేసేందుకు లాఠీచార్జి చేశారు.

నాగ మంగళ పట్టణంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా గడవలు జరిగాయి. కొందరు యువకులు నిమజ్జన ఊరేగింపుపై రాళ్లు రువ్వారు. అనంతరం పలు దుకాణాలను లూటీ చేసి నిప్పుపెట్టారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాళ్ల దాడిలో గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. పోలీసులు ఆ ప్రాంతంలో 144 సెక్షన్‌ విధించారు.

కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక వర్గానికి వంతపాడటం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ప్రతిక్ష బీజేపీ నేతలు ఫైర్‌ అయ్యారు. ఘర్షణ వాతావరణం చల్లార్చేందుకు కేంద్ర బలగాలను ప్రభుత్వం రంగంలోకి దింపింది.

Tags

Next Story