Vistara : నవంబర్ 11న విస్తారా చివరి ప్రయాణం

Vistara : నవంబర్ 11న విస్తారా చివరి ప్రయాణం
X

ఎయిరిండియాతో విలీనం నేపథ్యంలో నవంబర్ 11న విస్తారా చివరి ఫ్లైట్ నడవనుంది. ఆ తర్వాత సంస్థ విమానాలన్నీ ఎయిరిండియా నిర్వహణలోకి వెళతాయి. బుకింగ్‌లు సైతం ఎయిరిండియా వెబ్‌సైట్‌ నుంచే జరగనున్నాయి. సెప్టెంబర్ 3 నుంచి విస్తారాలో బుకింగ్‌లు నిలిచిపోనున్నాయి. నవంబర్ 11 వరకు మాత్రం కార్యకలాపాలన్నీ యథావిధిగా కొనసాగుతాయని కంపెనీ ప్రకటించింది.ఎయిరిండియాలో విస్తారాను విలీనం చేసే ప్రతిపాదిత ఒప్పందంలో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం భారత ప్రభుత్వం నుంచి తమకు అనుమతి లభించినట్లు ‘సింగపూర్ ఎయిర్‌లైన్స్’ శుక్రవారం వెల్లడించింది. ఈ క్లియరెన్స్‌తో ఎయిరిండియాలో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ 25.1 శాతం వాటాలు కొనుగోలు చేస్తుంది. దీంతో ఈ విలీన ప్రక్రియ ఈ ఏడాది చివరికి పూర్తయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎయిరిండియా, విస్తారా విలీనాన్ని 2022 నవంబర్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags

Next Story