Lok Sabha : రాజ్యసభ ముందుకు వక్ఫ్ బిల్లు.. లోక్ సభలో ఏం జరిగిందంటే?

వక్స్ సవరణ బిల్లు-2024కు బుధవారం అర్ధరాత్రి లోక్ సభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, నిరసనల మధ్య బిల్లుపై సుదీర్ఘంగా వాడీవేడి చర్చజరిగింది. బిల్లుకు సవరణలు ప్రతిపాదిస్తూ తీర్మానాలు ప్రవేశపెట్టాలని పలువురు విపక్ష సభ్యలు కోరగా స్పీకర్ నిరాకరించారు. అనంతరం అర్ధరాత్రి 12.10 గం.ల సమయంలో స్పీకర్ ఓటింగ్ కు రూలింగ్ ఇచ్చారు. ఆ సమయంలో సభలో 390 సభ్యులుండగా, బిల్లుకు అనుకూలంగా 226 మంది ఓటేయగా, 163 మంది వ్యతిరేకించారు. మరొకరు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. అనంతరం లోకసభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ పూర్తయినట్లు ప్రకటన చేయగా, స్పీకర్ ఓం ప్రకాష్ బిల్లా వక్స్ బిల్లు లోక్సభ ఆమోదం పొందినట్లు ప్రకటించేశారు. గురువారం రాజ్యసభలో వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com