WAR: ఖమేనీ, నెతన్యాహు.. బతికే ఉన్నారా?

WAR: ఖమేనీ, నెతన్యాహు.. బతికే ఉన్నారా?
X
ఖమేనీ మరణంపై వీడని ఉత్కంఠ...నెతన్యాహు ఆరు వేళ్ల మిస్టరీ.. తప్పుదోవ పట్టించే ప్రచారం

‘‘యు­ద్ధం వచ్చి­న­ప్పు­డు మొ­ట్ట­మొ­దట బల­య్యే­ది సత్య­మే’’ అని మొ­ద­టి ప్ర­పంచ యు­ద్ధ కా­లం­లో అమె­రి­క­న్ సె­నె­ట­ర్ హై­రా­మ్ జా­న్స­న్ అన్న మా­ట­లు, నేటి పశ్చి­మా­సి­యా రణ­రం­గం­లో అక్షర సత్యా­లు­గా మా­రు­తు­న్నా­యి. ఇరా­న్‌­పై అమె­రి­కా, ఇజ్రా­యె­ల్ సం­యు­క్తం­గా చే­ప­ట్టిన ‘ఆప­రే­ష­న్ ఎపి­క్ ఫ్యూ­రీ’, ‘ఆప­రే­ష­న్ రో­రిం­గ్ లయన్’ దా­డుల నే­ప­థ్యం­లో సమా­చార యు­ద్ధం పరా­కా­ష్ట­కు చే­రు­కుం­ది. యు­ద్ధం మొ­ద­లైన తొ­లి­రో­జే ఇరా­న్ సు­ప్రీం లీ­డ­ర్ మొ­జ్త­బా ఖమే­నీ మర­ణిం­చా­ర­నే వా­ర్త­లు సో­ష­ల్ మీ­డి­యా­లో దా­వా­న­లం­లా వ్యా­పిం­చ­గా, ఆయన బా­ధ్య­త­లు చే­ప­ట్టి­న­ప్ప­టి నుం­డి ఇప్ప­టి­వ­ర­కు భౌ­తి­కం­గా ఎక్క­డా ప్ర­జల ముం­దు­కు రా­క­పో­వ­డం ఈ అను­మా­నా­ల­కు మరింత ఆజ్యం పో­స్తోం­ది. ప్ర­త్య­ర్థు­ల­ను మా­న­సిక దె­బ్బ తీ­య­డా­ని­కి చేసే ప్ర­చా­ర­మో లేక ని­జం­గా­నే ఇరా­న్ నా­య­క­త్వ శూ­న్య­త­లో ఉందో తె­లి­యక అం­త­ర్జా­తీయ సమా­జం అయో­మ­యం­లో పడి­పో­యిం­ది.

బ్రి­టీ­ష్ పత్రిక ‘ది సన్’ కథనం ప్ర­కా­రం, ఖమే­నీ దా­డు­ల్లో తీ­వ్రం­గా గా­య­ప­డి కో­మా­లో ఉన్నా­ర­ని, ఆయన కా­ళ్లు కో­ల్పో­వ­డ­మే కా­కుం­డా అం­త­ర్గత అవ­య­వా­లు చి­ట్లి­పో­యా­య­ని తె­లు­స్తోం­ది. ఇరా­న్ లో వం­ద­లా­ది మంది ప్ర­జ­లు మొ­జ్త­బా చి­త్ర­ప­టా­ని­కి వి­ధే­యత ప్ర­క­టి­స్తు­న్న వీ­డి­యో­లు బయ­ట­కు రా­వ­డం, సా­ధా­ర­ణం­గా అగ్ర­నే­త­లు బయ­ట­కు రా­లే­ని స్థి­తి­లో ఉన్న­ప్పు­డు మా­త్ర­మే ఇలా చి­త్ర­ప­టాల ద్వా­రా మద్ద­తు తె­ల­ప­డం ఒక ఆన­వా­యి­తీ­గా వస్తోం­ది. అమె­రి­కా అధ్య­క్షు­డు ట్రం­ప్ సైతం ఖమే­నీ ఏదో ఒక రూ­పం­లో బతి­కే ఉన్నా­ర­ని, కానీ ఆయన ‘బాగా దె­బ్బ­తి­న్నా­ర­ని’ వ్యా­ఖ్యా­నిం­చ­డం గమ­నా­ర్హం. ఇరా­న్ ప్ర­భు­త్వం ఈ వా­ర్త­ల­ను ఖం­డి­స్తూ లే­ఖ­లు వి­డు­దల చే­స్తు­న్న­ప్ప­టి­కీ, ఒక్క ని­మి­షం లైవ్ వీ­డి­యో­లో ఎం­దు­కు కని­పిం­చ­డం లే­ద­న్న ఇజ్రా­యె­ల్ ప్ర­శ్న­ల­కు సమా­ధా­నం లభిం­చ­డం లేదు.

నెతన్యాహు విషయంలోనూ...

కే­వ­లం ఇరా­న్ వైపు మా­త్ర­మే కాదు, ఇజ్రా­యె­ల్ ప్ర­ధా­ని బె­న్జ­మి­న్ నె­త­న్యా­హు వి­ష­యం­లో­నూ ఇలాం­టి వింత పరి­స్థి­తు­లే కని­పి­స్తు­న్నా­యి. ఇరా­న్ దా­డు­ల్లో నె­త­న్యా­హు ఉన్న బం­క­ర్ ధ్వం­స­మైం­ద­ని, ఆయన మర­ణిం­చా­రం­టూ ఇరా­న్ మీ­డి­యా సం­స్థ­లు కథ­నా­ల­ను ప్ర­సా­రం చే­య­గా, దా­ని­కి తగ్గ­ట్టు­గా­నే ఆయన కూడా యు­ద్ధం మొ­ద­లై­న­ప్ప­టి నుం­డి భౌ­తి­కం­గా ఎక్క­డా మీ­డి­యా కం­టి­కి చి­క్క­లే­దు. తా­జా­గా మా­ర్చి 12న నె­త­న్యా­హు వీ­డి­యో లిం­క్ ద్వా­రా మీ­డి­యా ముం­దు­కు వచ్చి­న­ప్ప­టి­కీ, అది ‘కృ­త్రిమ మేధ’ (AI) సృ­ష్టిం­చిన మా­యా­జా­ల­మ­ని పలు­వు­రు అను­మా­ని­స్తు­న్నా­రు. ఆ వీ­డి­యో­లో నె­త­న్యా­హు ఒక్క­రే కని­పి­స్తుం­డ­టం, ప్ర­శ్న­లు అడి­గే వి­లే­క­రుల ము­ఖా­లు కన­ప­డ­కుం­డా కే­వ­లం గొం­తు­లు మా­త్ర­మే వి­ని­పిం­చ­డం ఈ అను­మా­నా­ల­కు బలం చే­కూ­రు­స్తోం­ది.

ము­ఖ్యం­గా ఆ వీ­డి­యో­లో నె­త­న్యా­హు కు­డి­చే­తి­కి ఆరు వే­ళ్లు కని­పిం­చా­య­ని, వే­ళ్ల పరి­మా­ణం­లో అస­మా­న­త­లు ఉన్నా­య­ని సో­ష­ల్ మీ­డి­యా­లో వె­లు­వ­డు­తు­న్న వి­శ్లే­ష­ణ­లు ఏఐ మా­యా­జా­లా­న్ని ధ్రు­వీ­క­రి­స్తు­న్నా­యి. ప్రె­స్ కా­న్ఫ­రె­న్స్‌­లో వి­లే­క­రు­లు ప్ర­శ్న­లు అడు­గు­తు­న్న సమ­యం­లో­నే ఇజ్రా­యె­ల్‌­లో యు­ద్ధ సై­ర­న్లు మో­గి­నా, నె­త­న్యా­హు కనీ­సం కను­రె­ప్ప సైతం ఆర్ప­కుం­డా, సై­ర­న్ శబ్దా­న్ని వి­న­న­ట్టు­గా తాను అను­కు­న్న­ది చె­ప్పు­కొం­టూ పో­వ­డం అత్యంత యాం­త్రి­కం­గా అని­పిం­చిం­ది. ఇలా ఇద్ద­రు బద్ధ­శ­త్రు­వు­లైన దే­శాల అగ్ర­నే­త­లు ‘డి­జి­ట­ల్ గూడు’ దాటి బయ­ట­కు రా­క­పో­వ­డం, అగ్ర­నే­తల అదృ­శ్యం వె­నుక ఉన్న అసలు రహ­స్య­మేం­టో ఎవ­రి­కీ అం­తు­చి­క్క­డం లేదు. ఒకరు 23వ పు­ల­కే­శి­లా పట్టు­కో­ల్పో­యి, మరొ­క­రు ఉత్తర కు­మా­రు­డి­లా వె­న­క­డు­గు వే­స్తూ కా­ల­క్షే­పం చే­య­డం దే­శాల భవి­ష్య­త్తు­ను ప్ర­శ్నా­ర్థ­కం చే­స్తోం­ది.

Tags

Next Story