WAR: ఆర్మీ అదుపులో పాక్ పైలట్

పాక్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పి కొడుతోంది. పాక్ ప్రయోగించిన డ్రోన్లు, రాకెట్లను నేలమట్టం చేసింది. తాజాగా జమ్మూలోని అఖ్నూర్ సమీపంలో పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన F- 16 పైలట్‌ను భారత్ పట్టుకుంది. న్నట్లు సమాచారం అందుతోంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేసిన ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు చావుదెబ్బ తగిలింది. అయినా ఆ దేశం తన వక్రబుద్ధిని మార్చుకోకుండా.. భారత్‌పైకి దాడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. జమ్ము, పఠాన్‌కోట్, ఉధంపూర్ సైనిక స్థావరాలపై పాకిస్తాన్ దాడులకు తెగబడిందని రక్షణశాఖ తెలిపింది. పాక్ ప్రయోగించిన ఎనిమిది మిసైల్స్‌ను భారత సైన్యం వీరోచితంగా కూల్చేసింది. పాక్ దాడుల్లో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టామని రక్షణశాఖ వెల్లడించింది. మరోవైపు పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లోని గగనతల రక్షణకు సంబంధించిన రాడార్లను, వ్యవస్థలను భారత్ ధ్వంసం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com