PM Modi : ఉగ్రవాదుల్లో ఏ ఒక్కడినీ వదలం.. సౌదీ నుంచి తిరిగొచ్చిన ప్రధాని మోడీ

కశ్మీర్ పహల్గాంలో ఉగ్రమేథం సృష్టించిన ముష్కరుల్లో ఒక్కడినీ కూడా వదిలి పెట్టబోమని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. సౌదీ పర్యటన నుంచి అకస్మాత్తుగా తిరిగివచ్చిన ప్రధాని జరిగిన ఉగ్రవాద ఊచకోత ఘటనపై అత్యున్నత స్థాయిలో రివ్యూ చేశారు. భారత్ కు సపోర్ట్ గా నిలబడిన అమెరికా సహా అగ్ర దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. కశ్మీర్ లో స్వేచ్ఛగా పర్యటించే రోజులు మళ్లీ తెస్తామని.. ఉగ్రవాద ఆనవాళ్లు లేకుండా చేస్తామన్నారు.
మంగళవారం మధ్యాహ్నం జెడ్డా విమానాశ్రయంలో మోడీకి ఘన స్వాగతం లభించింది. పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సౌదీ బయల్దేరి వెళ్లారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రిమొహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు, 2016, 2019లో మోడీ సౌదీ అరేబియాలో రెండు సార్లు పర్యటించారు. సౌదీలో మోడీకిది మూడవ పర్యటన. ఎన్నడూ లేని విధంగా మోడీని సౌదీ అరేబియా ప్రత్యేకంగా స్వాగతించింది. ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన పహల్గామ్ కాల్పులతో సడెన్ గా రద్దయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com