Amit Shah : దెబ్బకు దెబ్బ కొట్టి తీరుతాం.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు.

Amit Shah : దెబ్బకు దెబ్బ కొట్టి తీరుతాం.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు.
X

కాంగ్రెస్ నేతల లాగ తాము చూస్తూ కూర్చోలేమని.. దెబ్బకు దెబ్బ కొట్టి తీరుతాం అంటూ ఫైర్ అయ్యారు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా. ఆపరేషన్ సింధూర్ పై జరిగిన చర్చ లో భాగంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ విభజనకు కాంగ్రెస్ పార్టీదే పూర్తి బాధ్యత అన్నారు. నాటి ప్రధాని నెహ్రూ మన దేశంలోని 80 శాతం జలాలను పాక్ కు అప్పగించారని...జవహర్లాల్ నెహ్రూ నిర్ణయాల వల్లే జమ్మూకశ్మీర్ లో అనేక సమస్యలు వచ్చాయన్నారు. జమ్ము కాశ్మీర్ విషయంలో తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ కు లేదని మండిపడ్డారు.

ఇక ఆపరేషన్ సింధూర్ పై ఆయన మాట్లాడుతూ.... పహల్గాం ఉగ్ర దాడిని .. తాము దేశంపై జరిగిన దాడిగా పరిగణించామని అన్నారు. దాడి చేసిన వారిని ఇప్పటికే మట్టిలో కలిపేశామని.. 140 కోట్ల మంది ప్రజల గుండె చప్పుడును మోడీ ప్రపంచానికి చాటారని పేర్కొన్నారు. అదేవిధంగా పాక్ పై దాడులు చేసేందుకు భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని కామెంట్ చేశారు. మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టి 9న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని వివరించారు. మన భద్రతా బలగాల దాడుల్లో ఒక్క పౌరుడు కూడా మరణించలేదని అమిత్ షా తెలిపారు.

పాకిస్తాన్ భూభాగం లోకి వెళ్లి మన భద్రత బలగాలు చేసిన దాడిలో పలువురు ఉగ్రవాద నేతలు హతమయ్యారని షా పేర్కొన్నారు. ఉగ్రవాదం పై పాకిస్తాన్ వైఖరిని ప్రపంచానికి చాటి చెప్పమన్నారు. కాగా ఆపరేషన్ సింధూర్ ను ఎందుకు ఆపేశారని విపక్ష సభ్యులు ప్రశ్నించడాన్ని ఆయన తప్పు పట్టారు. మే 10న పాక్ డీజీఎంవో ఫోన్ చేసి యుద్ధం ఆపాలని విజ్ఞప్తి చేశారని సభకు తెలిపారు. యుద్ధాల వల్ల ఏర్పడే పరిణామాలు విపక్ష సభ్యులకు తెలియదా అని ప్రశ్నించారు.

Tags

Next Story