CM Stalin : ఎన్నికల అక్రమాలపై కాంగ్రెస్‌తో కలిసి నడుస్తాం- సీఎం స్టాలిన్

CM Stalin : ఎన్నికల అక్రమాలపై కాంగ్రెస్‌తో కలిసి నడుస్తాం- సీఎం స్టాలిన్
X

బీజేపీ, ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కై మోసాలకు పాల్పడ్డాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు తమిళనాడు సీఎం స్టాలిన్ సమర్ధించారు. ఈసీని బీజేపీ రిగ్గింగ్ యంత్రంగా మార్చిందని ఆరోపించారు. ఎన్నికల అక్రమాలపై పోరాటంలో కాంగ్రెస్‌తో డీఎంకే కలిసి నడుస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే అపహాస్యం పాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోమని.. రాహుల్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరపాలని స్టాలిన్ డిమాండ్ చేశారు.

మరోవైపు స్పష్టమైన ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం రిలీజ్ చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నియోజకవర్గంలో సర్వే నిర్వహించగా.. దాదాపు లక్ష నకిలీ ఓట్లు తేలాయని తెలిపారు. ఈ నిజాన్ని బయటపెట్టిన ఎన్నికల కమిషన్ మాత్రం మౌనంగా ఉందని విమర్శించారు.

Tags

Next Story