West Bengal : దీదీ దిద్దుబాటు.. మహిళల సేఫ్టీకి స్పెషల్ యాప్

West Bengal : దీదీ దిద్దుబాటు.. మహిళల సేఫ్టీకి స్పెషల్ యాప్
X

వెస్ట్ బెంగాల్ లో వైద్యురాలిపై హత్యాచారం కేసు నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా పని ప్రదేశాల్లో ఉద్యోగినిల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. ఎమర్జెన్సీ సమయాల్లో మహిళలు, పోలీసులకు సమాచారం అందించేందుకు ప్రత్యేక యాప్ ను రూపొందిస్తున్నట్లు తెలిపింది.

రాత్రి షిఫ్టుల్లో విధులు నిర్వర్తించే మహిళల కోసం, ముఖ్యంగా ప్రభుత్వం ఆస్పత్రుల్లో పనిచేసే మహిళల కోసం ప్రత్యేక రిటైరింగ్ గదులు, సీసీటీవీలు, స్పెషల్ యాక్సెస్ ఫోన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, హాస్టళ్లు, మహిళలకు రాత్రి షిఫ్టులు ఉండే ఇతర పని ప్రదేశాల్లో హెల్పర్స్ వాలంటీర్లను అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది.

రాష్ట్రంలో రాత్రిళ్లు విస్తృతంగా ఆల్కహాల్ బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం పేర్కొంది. పోలీసు పెట్రోలింగ్ ను పెంచుతామని వెల్లడించింది.

Tags

Next Story