Rajnath Singh : చైనా ప్రాంతాల పేర్లను భారత్‌ మారిస్తే

Rajnath Singh :  చైనా ప్రాంతాల పేర్లను భారత్‌ మారిస్తే
చైనాకి కు రాజ్‌నాథ్‌ హెచ్చరిక

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెట్టడాన్ని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మరోసారి ఖండించారు. భారత్‌ కూడా అదే పని చేసి సరిహద్దులోని చైనా భూభాగాల పేర్లు మారిస్తే....అవి భారత్‌వి అయిపోతాయా అని ప్రశ్నించారు. అరుణాచల్‌లో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజ్‌నాథ్‌......అరుణాచల్‌ ప్రదేశ్‌ భారత్‌లో అంతర్భాగమని పునరుద్ఘాటించారు. చైనా ఎత్తుగడతో వాస్తవాలు మారవని స్పష్టం చేశారు. ఇటువంటి దుందుడుకు చర్యల వల్ల ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించే ప్రమాదం ఉందని రాజ్‌నాథ్‌ చైనాను హెచ్చరించారు. తాము పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఎవరైనా తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తే మాత్రం..వారికి దీటైన జవాబు ఇవ్వగల సామర్థ్యమూ ఉందని వెల్లడించారు.

అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులపై చైనా కొద్దిరోజుల క్రితం మరోసారి వివాదాస్పద ప్రకటన చేసింది. ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు తమవేనంటూ, వాటి పేర్లు మారుస్తున్నట్లు తెలిపింది. 30 ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టి ఆ లిస్టును ప్రభుత్వ వెబ్ సైట్ లో ఉంచింది. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. ఈ పేరు మార్పులు మే 1 నుంచి అమలులోకి వస్తాయని, అప్పటి నుంచి ఆయా ప్రాంతాలను కొత్త పేర్లతోనే పిలవాలని స్పష్టం చేసింది. చైనాకు చెందిన ప్రాంతాలకు విదేశీ పేర్లు ఉండడం వల్ల చైనా సార్వభౌమాధికార హక్కులకు భంగం కలిగించే ప్రమాదం ఉందని పేర్కొంది. అందుకే ఆ ప్రాంతాలను సొంత భాషలోనే పిలవాలని, విదేశీ భాషల నుంచి మాండరిన్ లోకి తర్జుమా చేయొద్దని తన ప్రజలకు సూచించింది. ఈ క్రమంలోనే విదేశీ పేర్లతో పిలుస్తున్న తమ భూభాగాలకు కొత్త పేర్లను పెడుతున్నట్లు చైనా ప్రభుత్వం పేర్కొందని గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది.

భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌లో స్థలాల పేరు మార్చడానికి చైనా తన తెలివిలేని ప్రయత్నాలను కొనసాగించింది అని భారత విదేశాంగ శాఖ పేర్కొనింది. మేము అలాంటి ప్రయత్నాలను గట్టిగా తిరస్కరిస్తున్నాము.. కనుగొన్న పేర్లను కేటాయించడం అరుణాచల్ ప్రదేశ్‌గా ఉన్న వాస్తవికతను మార్చదు.. ఆ రాష్ట్రం ఎల్లప్పుడూ భారత్ లో అంతర్భాగంగా ఉంటుంది అని MEA అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story