CM Yogi Adityanath : మసీదులను తీసుకొని బీజేపీ ఏం చేస్తది? : సీఎం యోగి ఆదిత్యనాథ్

CM Yogi Adityanath : మసీదులను తీసుకొని బీజేపీ ఏం చేస్తది? : సీఎం యోగి ఆదిత్యనాథ్
X

మసీదులు, వక్స్ ఆస్తులకు సంబంధించి ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. వక్స్ పేరుతో వాళ్లు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏమిటని ప్రశ్నిం చిన యోగి... మసీదులను తీసుకొని బీజేపీ ఏం చేస్తుందన్నారు. వర్ఫ్ భూములు దుర్వినియోగం అవుతున్నాయని విమర్శించారు. 'ఎంఐఎం అధ్య క్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఈ బిల్లును వ్యతిరేకించారు. రాజ్యాంగ విరుద్ధం అన్నారు. మసీదులు, మసీదులాలను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కానీ ఆక్రమణల పాలైన భూములను తిరిగి కాపాడటమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం' అన్నారు. ఇవాళ ఓ జాతీయ మీడియా సంస్థలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

Tags

Next Story