Dharmendra : తమిళులు హిందీ నేర్చుకుంటే తప్పేంటి.. ధర్మేంద్ర హాట్ కామెంట్స్

Dharmendra : తమిళులు హిందీ నేర్చుకుంటే తప్పేంటి.. ధర్మేంద్ర హాట్ కామెంట్స్
X

దేశవ్యాప్తంగా నూతన విద్యా విధానాన్ని (ఎన్ఎస్ఈపీ) అమలు చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం అన్నారు. ఎన్ఎస్ఈపీ పట్ల తమిళనాడు ప్రభుత్వ వ్యతిరేకతను రాజకీయ చర్యగా తోసిపుచ్చారు. కొత్త విద్యావిధానం విద్యార్థులపై హిందీ లేదా మరే ఇతర భాషను బలవంతంగా రుద్దదని చెప్పారు. అయినా తమిళనాడు విద్యార్థి బహుభాషా ప్రావీణ్యం సాధిస్తే తప్పేంటని ప్రశఅనించారు. తమిళం, ఇంగ్లీష్ తోపాటు ఇతర భారతీయ భాషలు నేర్చుకంటే మంచిదేనని పేర్కొన్నారు. తమిళనాడులోని కొంతమంది స్నేహితులు రాజకీయాలు చేస్తున్నారు. కానీ భారత ప్రభుత్వం ఎన్ఎస్ఈపీ అమలుకు కట్టుబడి ఉందని తేల్చిచెప్పారు. అయితే త్రిభాషా సూత్రం అమలుపై కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య విభేదాలు ఉన్నమాట వాస్తవమేనన్నారు. తమిళనాడు (ప్రభుత్వం) తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ విధానాన్ని అమలు చేయడం లేదని విమర్శించారు.

Tags

Next Story