WhatsApp : 85 లక్షల వాట్సప్‌ ఖాతాలు బ్యాన్

WhatsApp : 85 లక్షల వాట్సప్‌ ఖాతాలు బ్యాన్
X

మెటా ఆధ్వర్యంలోని ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ పెద్దఎత్తున భారతీయ ఖాతాలపై నిషేధం విధించింది. ఐటీ రూల్స్‌ 2021ఉల్లంఘన, వాట్సప్‌ను దుర్వినియోగం చేస్తున్న కారణంగా ఈ చర్యలకు దిగింది. ఒక్క సెప్టెంబర్‌లోనే ఏకంగా 85 లక్షల ఖాతాలను బ్యాన్‌ చేసినట్లు వెల్లడించింది. వీటిలో 16,58,000 ఖాతాలపై ఎలాంటి ఫిర్యాదులూ అందకపోయినప్పటికీ, ఐటీ నిబంధనలను అతిక్రమించినందున చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేసింది. భారత్‌లో వాట్సప్‌కు 600 మిలియన్లకుపైగా వినియోగదారులు ఉన్నారు. తన ప్లాట్‌ఫామ్‌ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు గానూ వాట్సప్‌ ఈ తరహా చర్యలు తీసుకుంటోంది. మోసం లేదా తప్పుడు సమాచారం చేరవేతకు బల్క్‌, స్పామ్‌ మెసేజులు పంపే యూజర్లపై చర్యలకు దిగుతోంది. స్థానిక చట్టాలకు వ్యతిరేకంగా అక్రమ కార్యకలాపాలకు పాల్పడినా వాట్సప్‌ చర్యలు తీసుకుంటోంది. ఇదిలా ఉండగా.. వాట్సప్‌ ఆగస్టులో 84.58లక్షల ఖాతాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. వాటిలో కూడా 16,61,000 ఖాతాలకు యూజర్ల నుంచి ఎలాంటి ఫిర్యాదులూ రాకుండానే నిబంధనల ఉల్లంఘన కారణంతో తొలగించినట్లు పేర్కొంది.

Tags

Next Story