Delhi CM Rekha Gupta : ఎవరీ రేఖాగుప్తా? బ్యాక్ గ్రౌండ్ హిస్టరీ ఇదే

Delhi CM Rekha Gupta : ఎవరీ రేఖాగుప్తా? బ్యాక్ గ్రౌండ్ హిస్టరీ ఇదే
X

ఢిల్లీ సీఎంగా అనూహ్యంగా పదవిని దక్కించుకున్నారు బీజేపీ మహిళా ఎమ్మెల్యే రేఖా గుప్తా. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమెకు ఏకంగా సీఎం పదవి వరించింది. 1974 జులై 19న హర్యానాలోని జుల్నాలో రేఖా గుప్తా జన్మించారు. విద్యార్థి దశలోనే ఆరెస్సెస్ భావజాలం వైపు ఆకర్షితులయ్యారు. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1996లో ఢిల్లీ వర్సిటీ విద్యార్ధి సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే 2007, 2012లో రెండుసార్లు ఉత్తరి పీతప్పుర నుంచి మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిచారు. ఆ తర్వాత ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా, మహిళామోర్చా జాతీయ ఉపాధ్యక్షులిగా కీలక బాధ్యతల్లో పనిచేశారు.

Tags

Next Story