Delhi Elections : ఆమ్ ఆద్మీ పార్టీకి అధికారం ఎందుకు దూరమైందంటే?

Delhi Elections : ఆమ్ ఆద్మీ పార్టీకి అధికారం ఎందుకు దూరమైందంటే?
X

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 2015, 2020 ఎన్నికల్లో 70 స్థానాలకు 67, 62 స్థానాల్లో అద్భుత విజయం సాధించి అధికారంలోకి వచ్చిన ఆప్ ను ఈసారి పలు వివాదాలు చుట్టుముట్టాయి. హామీలు అమలు చేయకపోవడం, ఎయిర్ క్వాలిటీపై ప్రజల అసంతృప్తి, సీఎం అధికార నివాసం శేష్ మహల్‌ను రూ.33.66 కోట్లతో అభివృద్ధి చేసుకోవడంపై ఆరోపణలు, కేజ్రీవాల్ అవినీతిపై బీజేపీ ప్రచారం, లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ , మంత్రులు, ఆప్ నేతలు జైలుకెళ్లడంతో పాలన గాడితప్పి ఆ పార్టీని అధికారానికి దూరం చేశాయి.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మేజిక్ ఫిగర్ దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఆ పార్టీ 19 చోట్ల విజయం సాధించగా మరో 27 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. అధికారం చేపట్టాలంటే 36 సీట్లు అవసరం. కానీ ప్రస్తుత ఫలితాలు చూస్తుంటే కాషాయ పార్టీ అంతకుమించిన స్థానాల్లో గెలుపొందేలా కనిపిస్తోంది. మరోవైపు కేజ్రీవాల్, సిసోడియా ఓటములతో చతికిలపడ్డ ఆప్ 8 చోట్ల గెలుపొందింది. మరో 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. 27 ఏళ్ల తర్వాత అక్కడ అధికారాన్ని చేపట్టడానికి వ్యూహాలు రచించింది. ఢిల్లీని ఆనుకొని ఉన్న హరియాణా, ఉత్తర ప్రదేశ్ , రాజస్థాన్‌లో రూలింగ్‌లో ఉండటం, కేంద్రంలోనూ హ్యాట్రిక్ పాలన కొనసాగించడం కమలం పార్టీకి బాగా కలిసొచ్చింది. 2017 నుంచి ఉత్తర ప్రదేశ్లో, 2023 నుంచి రాజస్థాన్, హరియాణాలో గతేడాది కమలం 2వసారి మళ్లీ అధికారంలోకి రావడంతో కాషాయం శ్రేణులు హస్తిన ఓటర్లను ప్రభావితం చేయగలిగారు.

Tags

Next Story