'ఇండిగో' దొంగాట.. కావాలనే చేస్తోందా..?

ఇండిగో.. ఇండిగో.. ఇండిగో.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు వినిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులు ఆగిపోయాయి. నాలుగు రోజులగా ఇదే తంతు. వేలాది ఫ్లైట్లు క్యాన్సిల్ అవుతున్నాయి. మరి ఇండిగోకే ఎందుకీ సమస్య. వేరే ఎయిర్ లైన్స్ సంస్థలకు రావట్లేదు కదా. దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఇండిగోకు ఇండియన్ ఎయిర్ లైన్స్ లో 60 పర్సెంట్ కంటే ఎక్కువ షేర్ ఉంది. అంత పెద్ద సంస్థకు పైలెట్స్ టైమ్ కు దొరకట్లేదు. ఇండిగో సంస్థ పైలట్స్ కు బెటర్ సాలరీస్ ఇవ్వట్లేదంట. చాలా మంది పైలట్స్ చెప్పాపెట్టకుండా సెలవులు పెట్టి వెళ్లిపోయారు.
ఇండియాలో లెసెన్సెడ్ పైలట్లు 26500 మంది ఉంటే.. అందులో పనిచేస్తున్న వాళ్లు 11700 మంది మాత్రమే. మరి మిగతా వాళ్లకు ఏమైంది. వాళ్లంతా ఎక్కడకు వెళ్లారు అంటే విదేశాల్లో జాబ్ చేస్తున్నారు. ఇండియాలో పనిభారం ఎక్కువ, సాలరీలు తక్కువ. అందుకే వేరే కంట్రీస్ లో వర్క్ చేసుకుంటున్నారు. మరి డీజీసీఏ కొత్త రూల్స్ తీసుకొస్తుందని ఇండిగోకు ముందే తెలుసు. అయినా పైలట్లను ఎందుకు రిక్రూట్ చేసుకోలేదు. మిగతా ఎయిర్ లైన్స్ సంస్థలు పైలట్లను తీసుకున్నాయి కదా. ఇక్కడే ఇండిగో దొంగాట ఆడుతోందని అంటున్నారు. కావాలనే ఫ్లైట్లు క్యాన్సిల్ చేయించి డీజీసీఏ కొత్త రూల్స్ ను వెనక్కు తీసుకునేలా చేస్తుందని చెబుతున్నారు.
ఎందుకంటే ఇండియన్ ఎయిర్ లైన్స్ లో 60 పర్సెంట్ కంటే ఎక్కువ ఇండిగోదే ఉంది. కాబట్టి ఇలాంటి సమస్యలు క్రియేట్ చేసి రూల్స్ ను సవరించేలా ప్లాన్ చేస్తుందేమో అంటున్నారు. కొత్త రూల్స్ వల్ల ఇండిగో వేల మంది కొత్త పైలట్లను, సిబ్బందిని తీసుకోవాలి. ఒక్కో ఫ్లైట్ ల్యాండింగ్ సంఖ్య కూడా తగ్గింది. దీని కోసం వందల కోట్లలో ఖర్చు చేయాలి. ఇదంతా చేయడం ఇండిగోకు ఇష్టం లేదేమో. అందుకే ఇలాంటి గేమ్ ఆడుతుందని ఎయిర్ లైన్స్ నిపుణులు అంటున్నారు. ఒకే సంస్థకు ఇంత పెద్ద షేర్ ఇవ్వడం కూడా ఇక్కడ మైనస్ అయింది. అందరికీ సమాన వాటాలు ఉంటే ఈ పరిస్థితి వచ్చేదికాదు. ఎక్కడైనా గుత్తాధిపత్యం మంచిది కాదు. ఇండిగో మీద చర్యలకు కేంద్రం సిద్ధమైంది. కంటిన్యూ సమస్యలు ఫిబ్రవరి దాకా ఇలాగే ఉంటాయంటుంది. చూస్తుంటే ఈ పరిస్థితి కంటిన్యూ అయ్యేలా ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

