Mohan Bhagawat : మనకు మనమే దేవుళ్లమని చెప్పుకుంటే ఎలా? : మోహన్ భగవత్

మనకు నమే దేవుళ్లమని ప్రకటించుకోకూడదని.. ఆ విషయాన్ని జనమే నిర్ణయిస్తారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. 1971లో కీలక నేత శంకర్ దిన్‌కర్ కానే మణిపూర్ లో చేసిన సేవలను స్మరించుకొంటూ పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కొందరు మెరుపులా మెరవాలని కోరుకుంటారు. కానీ, పిడుగు పడిన తర్వాత మరింత చీకటిగా మారుతుందని వారు గుర్తించరు. కార్యకర్తలు ఒక దీపంలా .. అవసరమైనప్పుడు నిలకడగా వెలుగునివ్వాలి. శంకర్ దిన్‌కర్ 1971లో మణిపూర్ లో చిన్నారుల విద్య కోసం తీవ్రంగా కృషి చేశారు. అక్కడినుంచి విద్యార్థులను మహారాష్ట్రకు తీసుకొచ్చి వారికి బస ఏర్పాటుచేసి బోధనా సౌకర్యాలు కల్పించారు. ప్రస్తుతం మణిపూర్ లో భద్రతకు ఎటువంటి హామీ లేకుండా పోయింది. స్థానికులే వారి రక్షణ విషయంలో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారాలు, సేవా కార్యక్రమాల నిమిత్తం అక్కడికి వెళ్లే వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ పరిస్థితుల్లో కూడా ఆర్ఎస్‌ఎస్ వలంటీర్లు అక్కడ బలంగా నిలిచారు.సంఘ్ అక్కడే ఉండి.. శాంతిని నెలకొల్పేందుకు యత్నిస్తోంది. సాధారణ ఎన్‌జీవోలు చేయలేని పనిని సంఘ్ చేస్తోంది’ అని మోహన్ భగవత్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com