'భార్య కావాలి': వధువు కోసం ఆటో రిక్షాకు హోర్డింగ్ కట్టిన వ్యక్తి

భార్య కావాలి: వధువు కోసం ఆటో రిక్షాకు హోర్డింగ్ కట్టిన వ్యక్తి
ప్రస్తుత రోజుల్లో ప్రతి వ్యక్తి తాను చేసే పని వైరల్ కావాలనుకుంటున్నాడు..

ప్రస్తుత రోజుల్లో ప్రతి వ్యక్తి తాను చేసే పని వైరల్ కావాలనుకుంటున్నాడు.. అట్ లీస్ట్ ఓ నలుగురైనా తన గురించి మాట్లాడుకోవాలనుకుంటున్నాడు. అందుకే వెరైటీగా ఏదో ఒకటి చేస్తున్నారు.. ఫలితంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు..

మధ్యప్రదేశ్‌ దామోహ్‌లో నివసించే ఓ 29 ఏళ్ల వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు.. తాను జీవనోపాధికి ఉపయోగించే ఈ-రిక్షానే తన జీవిత భాగస్వామిని కూడా వెతికి పెడుతుందని భావించారు. అందుకే తన ఆటోకి ఓ హోర్డింగ్ ఏర్పాటు చేశాడు. దాని మీద తనకో వధువు కావాలని ప్రకటించాడు.. అందులో తన బయోడేటా అంతా నింపాడు. ఎత్తు, పుట్టిన తేదీ మరియు గోత్రం వంటి వ్యక్తిగత వివరాలన్నీ అందులో వివరించాడు. 60 ఏళ్లు నిండిన వాళ్లకు అమ్మాయిలు దొరకడం చాలా ఈజీ మన భారతదేశంలో.. మరి ఈయనకు ఇంత వరకు ఎందుకు దొరకలేదు అని బోర్డు చూసిన వాళ్లు అనుకుంటున్నారు.

29 ఏళ్ల దీపేంద్ర రాథోడ్ వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు, కానీ పరిపూర్ణ భాగస్వామి లక్షణాలు ఉన్న అమ్మాయి ఇంత వరకు ఎదురుపడలేదట. తనకు కులంతో, మతంతో పని లేదని, ఏ స్త్రీ అయినా పెళ్లి ప్రతిపాదనతో తనను సంప్రదించవచ్చని హోర్డింగ్ లో పేర్కొన్నాడు. మ్యాట్రిమోనీలో కూడా పేరు నమోదు చేసుకున్నాడు.. కానీ సరైన భాగస్వామి దొరకలేదని ఈ విధంగా ప్లాన్ చేశాడు.

నగరం వెలుపల ఉన్న మహిళను పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని దీపేంద్ర చెప్పాడు. ఈ హోర్డింగ్‌లో 29 ఏళ్ల యువకుడి ఎత్తు, పుట్టిన తేదీ మరియు సమయం, బ్లడ్ గ్రూప్, విద్యార్హతలు, 'గోత్రం' తదితర వివరాలు ఉన్నాయి.

పరిపూర్ణ జీవిత భాగస్వామిని పొందాలనే అతని విధానానికి దీపేంద్ర తల్లిదండ్రులు కూడా మద్దతు ఇచ్చారు. "నా తల్లిదండ్రులు దేవుని ఆరాధనలో బిజీగా ఉంటారు, కాబట్టి వారికి నాకు అమ్మాయిని వెతకడానికి సమయం లేదు, అందుకే నేనే భాగస్వామిని వెతుక్కునే పనిలో పడ్డాను అని రాథోడ్ చెప్పాడు.

రాథోడ్ తన సొంత ఇ-రిక్షా నడపడం ద్వారా తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎవరైతే తన బెటర్ హాఫ్‌గా మారతారో వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకుంటానని ఆయన అన్నారు. మరి ఆ అదృష్టవంతురాలు ఎవరో, ఎక్కడ ఉందో చూడాలి.

Tags

Next Story