Mamata Banerjee : 2026 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: మమతా బెనర్జీ

Mamata Banerjee : 2026 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: మమతా బెనర్జీ
X

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప.బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. కాంగ్రెస్, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. ‘ఢిల్లీలో ఆప్ కు కాంగ్రెస్, హరియాణాలో కాంగ్రెస్‌కు ఆప్ మద్దతివ్వలేదు. అందుకే బీజేపీ గెలిచింది. కానీ ఇక్కడ మన పార్టీ ఒక్కటే చాలు. వరుసగా నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’ అని పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో వ్యాఖ్యానించారు.

షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ఇంకా ఒక సంవత్సరం కంటే ఎక్కువ సమయం ఉంది. అయితే బెంగాల్‌లో మూడింట రెండొంతుల మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తామని తృణమూల్ శాసనసభ్యుల సమావేశంలో మమతా బెనర్జీ చెప్పారు. దీంతో పాటు బెంగాల్‌లో తృణమూల్ ఒంటరి పోరాటం చేస్తుందని.. ఎవరి సహాయం అవసరం లేదని తృణమూల్ ఆల్ టైమ్ లీడర్, మూడుసార్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీ స్ప‌ష్టం చేశారు.

బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 2011లో అధికారంలోకి వచ్చింది. ఇప్పటివరకూ మూడుసార్లు హ్యాట్రిక్ సాధించింది. అయితే నాలుగో సారి గెలుస్తామని మమత ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కేజ్రీవాల్ చేసిన తప్పే మమతా బెనర్జీ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఎన్నికల బరిలో నిలిచి ఓటమిపాలైందన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. కాంగ్రెస్ తో పొత్తు ఉంటేనే నాలుగో సారి బెంగాల్ లో తృణమూల్ నాలుగోసారి అధికారంలోకి రావడానికి ఈజీ అవుతుందని సూచిస్తున్నారు.

Tags

Next Story