బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించేనా..
దేశంలో బియ్యం ఎగుమతులపై నిషేధం విధించేందుకు రంగం సిద్ధమయ్యిందా.. కరువు తప్పదని కేంద్రం ముందస్తుగా చర్యలు చేపట్టిందా.. ఈ ప్రశ్నలకు అవుననే సమాదానం వస్తోంది. ముందజాగ్రత్త చర్యగా నాన్ బాస్మతి బియ్యం ఎగుమతులను నిషేధంచాలని కేంద్రం యోస్తోంది.ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని వార్తలు వస్తున్నాయి. మెజారిటీ రకాల బియ్యం ఎగుమతులను నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ చర్యలను గమనించిన కంపెనీలు.. ఇప్పటికే బియ్యం అమ్మకాలకు సంబంధించి కొత్త కాంట్రాక్టులు తీసుకోవడం లేదని తెలుస్తోంది.
జూన్‌లో నైరుతి రుతుపవనాలు దారి తప్పడంతో అతివృష్ఠి, అనావృష్టి కారణంగా దేశ వ్యాప్తంగా వరి పంట విస్తీర్ణం తగ్గింది. ముఖ్యంగా వరి అధికంగా పండించే పశ్చిమ బెంగాల్, బీహార్, యూపీతో పాటు పంజాబ్‌లలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణాదిలో సకాలంలో వర్షాలు పడక వరి విస్తీర్ణం తగ్గింది. దీంతో ఇప్పటికీ దేశీయంగా బియ్యం ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బియ్యం ధరలు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com