ప్రజా సమస్యలు వదిలేసి..సోషల్ మీడియాలో బిజీ .. మహిళా అధికారిపై వేటు

ప్రజా సమస్యలు వదిలేసి..సోషల్ మీడియాలో బిజీ .. మహిళా అధికారిపై వేటు
X

ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల కోసం పనిచేస్తూ.. వారి సమస్యలు పరిష్కరించాలి. కానీ, ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి మాత్రం..సోషల్ మీడియా మోజులో పడి, ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. దీంతో అధికారులు ఆమెపై వేటు వేశారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఓషిన్ శర్మ అనే ప్రభుత్వ అధికారిని మండిలోని సంధోల్‌లో తహసీల్దార్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె నిరంతరం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ పలుమార్లు వార్తల్లో నిలిచింది. ఒకవైపు తహసీల్దార్ గా బాధ్యతలు చేపడుతూనే సోషల్ మీడియాలో అవేర్‌నెస్ ప్రోగ్రాంలతో పాటు యువతను ఇన్‌ఫ్లూయేన్స్ చేసేలా వీడియోలు అప్‌లోడ్ చేస్తోంది. ఇందులో ఓ వీడియో వైరల్ కావడంతో గతంలో అసెంబ్లీలో సైతం ఆమె గురించి చర్చ జరిగింది. ఇటీవల మండి జిల్లా కలెక్టర్ అపూర్వ దేవగన్ సంధోల్, తహసీల్దార్ ఓషిన్ శర్మ పని తీరుపై సమీక్ష నిర్వహించారు. ఇందులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె సమయానికి ఏ పని పూర్తి చేయలేదని, ఆ ప్రాంతంలో చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయని గుర్తించారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ప్రభుత్వ పనుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఆమెకు నోటీసులు జారీ చేశారు. అంతేగాక ఆమెను సంధోల్ నుంచి బదిలీ చేశారు.

Tags

Next Story