Gulabrao: మహిళలు తమ పర్సుల్లో కత్తులు, కారం పొడి పెట్టుకోవాలి:మహారాష్ట్ర మంత్రి కామెంట్స్..

Gulabrao: మహిళలు తమ పర్సుల్లో కత్తులు, కారం పొడి  పెట్టుకోవాలి:మహారాష్ట్ర మంత్రి కామెంట్స్..
X
మహారాష్ట్ర మంత్రి గులాబ్ రావ్ పాటిల్

మహిళలు తమ రక్షణ కోసం తమ పర్సులో కత్తి, కారం పొడిని తీసుకెళ్లాలని, లిప్ స్టిక్‌తో పాటు ఇవి కూడా ఉండాలని మహారాష్ట్ర మంత్రి గులబ్‌రావ్ పాటిల్ శనివారం సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడ జరిగిన కార్యక్రమంలో శివసేన సీనియర్ నేత మాట్లాడుతూ..మహిళా సాధికారత కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను, ఆర్టీసీ బస్సు ఛార్జీలను సగానికి తగ్గించడం, లడ్కీ బహిన్ పథకం, బాలికలకు ఉచిత విద్య వంటి వాటిని కూడా హైలైట్ చేశారు.

‘‘మహిళా సాధికారత గురించి మనం మాట్లాడినా, నేడు అనేక అరాచకాలు జరుగుతున్నాయి. శివసేన ప్రముఖ్(బాల్ థాక్రే) ఆలోచన నుంచి మనం ప్రేరణ పొందినప్పుడు, మహిళలు లిప్ స్టిక్‌తో పాటు కారం పొడి, రాంపురి కత్తిని తీసుకెళ్లాలని చెప్పినందుకు జర్నలిస్టులు ఆయనను తీవ్రంగా విమర్శించారు’’ అని మంత్రి అన్నారు. కానీ నేటికి కూడా ఇదే పరిస్థితి ఉందని, నేటి యువతులు స్వీయరక్షణ కోసం వీటిని కలిగి ఉండాలని అభ్యర్థిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఫిబ్రవరి 25న పూణేలోని డిపోలో 26 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారం సహా మహిళలపై ఇటీవల జరిగిన నేరాల కేసులను ఆయన ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags

Next Story