ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్న యమున..

ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్న యమున..
యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి మించి కొనసాగుతోంది.

యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి మించి కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి 10:00 గంటలకు పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నదిలో నీటిమట్టం 205.48 మీటర్లుగా నమోదవడంతో ప్రమాద స్థాయి కంటే ఎక్కువగా ఉందని అధికారులు తెలియజేశారు.

తగ్గుముఖం పట్టింది కదా అని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో యమున నీటిమట్టం శుక్రవారం సాయంత్రం ప్రమాదకర స్థాయిని దాటింది.ఇదిలా ఉండగా, హత్నీ కుండ్ బ్యారేజీ నుంచి జూలై 11న సుమారు 3,60,000 క్యూసెక్కుల వరకు పెరిగిన నీటి విడుదల శుక్రవారం రాత్రి 7:00 గంటలకు నమోదైన ప్రకారం ఇప్పుడు 29,973 క్యూసెక్కులకు ప్రవహిస్తోంది.

జూలై 13 తర్వాత, యమునా 208.66 మీటర్ల గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది, అయితే గత రెండు-మూడు రోజులుగా నీటి మట్టంలో స్వల్ప హెచ్చుతగ్గులు ఉన్నాయి.

ఎనిమిది రోజుల పాటు నీటిమట్టం థ్రెషోల్డ్ పైన ప్రవహించడంతో జూలై 18న రాత్రి 8 గంటలకు ప్రమాద స్థాయి కంటే దిగువకు పడిపోయింది. జూలై 10 సాయంత్రం 5 గంటలకు నది ప్రమాద స్థాయిని అధిగమించింది., ఇది దేశ రాజధానిలో విస్తృతమైన వరదలకు దారితీసింది.

Tags

Read MoreRead Less
Next Story