ACCIDENT: రోడ్డుప్రమాదంలో మరణించిన యూట్యూబర్

ACCIDENT: రోడ్డుప్రమాదంలో మరణించిన యూట్యూబర్
'దిల్ సే బురా లగ్తా హై భాయ్' అంటూ కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు

ప్రముఖ యూట్యూబర్ దేవ్‌రాజ్‌ పటేల్ సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. సోమవారం స్నేహితుడితో కలిసి బైక్‌పై కలిసి వెళ్తుండగా, లారీని ఢీకొని వెనక చక్రాల కింద పడ్డాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు ప్రకటించారు.

రాయ్‌పూర్‌లో ఒక వీడియో షూటింగ్ చేసి తిరిగి వస్తుండగా మధ్యాహ్నం 3.30 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదసమయంలో బైక్‌పై వెనక సీటులో కూర్చున్న పటేల్ మరణించగా, స్నేహితుడు రాకేష్ మన్హర్‌కి ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు.

ఛత్తీస్‌ఘర్ ముఖ్యమంత్రి ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నివాళ్లర్పిస్తూ ట్వీట్ చేశాడు.

"దిల్ సే బురా లగ్తా హై భాయ్.. అంటూ దేవ్‌రాజ్ కోట్లాది మందిని అలరిస్తూ, వారి అభిమాన్ని సంపాదించుకున్నాడు. ఇంత చిన్న వయసులో ప్రతిభావంతుడిని కోల్పోవడం భాదాకరం. వారి కుటుంబానికి భగవంతుడు శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి" అంటూ ట్వీట్ చేశాడు.


యూట్యూబ్ ఫేమ్..


మీమ్స్ చూసేవారికి దేవ్‌రాజ్ పటేల్ బాగా పరిచయం. 'దిల్ సే బురా లగ్తా హై భాయ్' అంటూ విలక్షణ శైలితో మీమ్ స్టార్ అయ్యాడు. ఆ వీడియోతోనే సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. చమత్కారంతో కూడిన కామెడీ, టైమింగ్‌తో కూడిన పంచులతో అన్ని వయసుల వారిలో అభిమానుల్ని సంపాదించుకున్నాడు. రోజువారీ పనులు, సంఘలనల చుట్టూ హాస్యాన్ని జోడించి అతడు చేసే కామెడీతో తనకుంటూ ఒక ప్రత్యేక శైలి ఏర్పరచుకున్నాడు. యూట్యూబ్‌లో సుమారుగా 4.50 లక్షల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

ఛత్తీస్‌ఘడ్‌లోని మహాసముంద్‌లో జన్మించిన దేవ్‌రాజ్‌ ఫేం సాధించప్పటికీ సాధారణంగానే అందరితో కలివిడిగా ఉంటాడు. హంగూ ఆర్భాటాలకు లేకుండా అందరితో హుందాగా ఉంటూ అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు.

Tags

Read MoreRead Less
Next Story