YouTuber Jyoti Malhotra : పాకిస్తాన్ పై యూ ట్యూబర్ జ్యోతి ప్రేమ

మన రక్షణ వ్యవస్థకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవే స్తుందన్న ఆరోపణలపై హర్యానా పోలీసులు అరెస్టు చేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా డైరీలో విస్తుపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. ఆమెను విచారిస్తున్న ఎస్ఐ, ఐబీ, మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు ఆమె తన డైరీలో రాసుకున్న విషయాలను పరిశీలిస్తున్నారు. పా కిస్తాన్ పట్ల యూ ట్యూబర్కు ఉన్న ప్రేమ ఆమె రాసిన అంశాల ద్వారా వెల్లడైంది. 2012వ సంవత్సరానికి చెందిన డైరీలో తన 10 రోజుల పాక్ పర్యటన గురించి ఆమె పలు ఆసక్తికర విషయాలు రాసుకుంది. '10 రోజుల పర్య టన తర్వాత పాకిస్తాన్ నుంచి ఇవాళ నేను నా దేశం భారత్ కు తిరిగి వెళుతున్నాను. మా సబ్ స్టూబర్స్, మిత్రులు చాలా మంది కలిశారు. లాహోర్ను సందర్శించడానికి రెండు రోజులు సరిపోలేదు. సరిహద్దుల దూరాలు ఎంతకాలం ఉంటాయో తెలియదు. కానీ గుండెల్లోని బాధ తగ్గాలి. మనమంతా ఒకే భూభూగానికి చెం దినవాళ్లం. వీడియోలో చూపించని ఏదైనా అంశముంటే మీకు సంకోచం లేకుండా అడ గొచ్చు' అని వెల్లడించారు. పాకన్ను ఒక క్రేజీ అండ్ కలర్ఫుల్ దేశంగా అభివర్ణించిన జ్యోతి అక్కడి దేవాలయాలను రక్షించాలని, మరిన్ని గురుద్వారాలు నిర్మించాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com