కరోనాతో గేమ్సా.. 2 వేల మందికి పాజిటివ్..

కరోనా కంప్లీట్‌గా పోలేదు.. ఎక్కడో ఒక చోట నేనిక్కడే ఉన్నానంటూ రోజూ అక్కడక్కడా పదుల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కరోనా జాగ్రత్తలు తీసుకున్నాం కదా వైరస్ వ్యాప్తి చెందదు అనుకుంది స్కాట్లాండ్ ప్రభుత్వం. భారతీయులకు క్రికెట్ అంటే ఎంత పిచ్చో..యూరప్ దేశాల వాళ్లకి పుట్‌బాల్ క్రీడ అంటే అంత మక్కువ. స్కాంట్లాండ్‌లో జరిగే మ్యాచ్ కోసం పెద్ద ఎత్తున సాకర్ అభిమానులు లండన్‌కు క్యూ కట్టారు. వందల మైళ్లు రైలు విమానాల్లో ప్రయాణించి మరీ మ్యాచ్‌ని చూసేందుకు వెళ్లారు. అలా వెళ్లి వచ్చిన 2 వేల మంది కరోనా బారిన పడినట్లు స్కాట్లాండ్ ప్రజా ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్కాట్లాండ్ గ్లాస్గొలోని హంప్‌డెన్ స్టేడియం వద్ద జనాలు భారీగా గుమిగూడారు. బార్‌లు, పబ్‌ల దగ్గర కూడా జనం గుంపులుగా తిరిగారు. కరోనా ఆంక్షలను గాలికి వదిలేసారు. సామాజిక దూరం సంగతి సరేసరి. కనీసం మాస్కులు కూడా ధరించలేదు. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి భారీగా జరిగింది అని అధికారులు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com