#TELUGU PEOPLE WITH RAMOJI RAO : ట్విట్టర్‌లో గా ట్రెండ్‌ అవుతున్న హ్యాష్ ట్యాగ్

#TELUGU PEOPLE WITH RAMOJI RAO : ట్విట్టర్‌లో గా ట్రెండ్‌ అవుతున్న హ్యాష్ ట్యాగ్

హ్యాష్‌ట్యాగ్‌ తెలుగు పీపుల్‌ విత్‌ రామోజీ రావు ట్విట్టర్‌లో ఇండియా వైడ్‌ గా ట్రెండింగ్‌లో ఉంది.రామోజీ రావుకు మద్దతుగా వేల సంఖ్యలో ట్వీట్లు చేస్తూ మద్దతుగా నిలిస్తున్నారు తెలుగు ప్రజలు.వేలాది ఉద్యోగులకు ఉపాధి కల్పించే మార్గదర్శిపై కక్ష కడ్తారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఏటా రూ వెయ్యి కోట్లకు పైగా పన్నులు కట్టే సంస్థపై పగబడ్తారా..? లక్షలాది కస్టమర్ల విశ్వసనీయతనే కాలరాస్తారా..? ఈ కక్ష సాధింపు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉందా..? అంటూ ట్విట్టర్‌ వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు.

60ఏళ్ల చరిత్ర ఈనాడు గ్రూప్‌కు ఉందని దశాబ్దాలుగా ప్రజలతో పెనవేసుకున్న అనుబంధం రామోజీరావుదని, ఆ గ్రూపు సంస్థలది..అలాంటి అత్యున్నత సంస్థలపైనే కత్తికట్టిన నీచచరిత్ర జగన్మోహన రెడ్డిది..పగలు-ప్రతీకారాలకు పాల్పడ్డ పాలకుడు మట్టి కొట్టుకు పోవడం తథ్యం.. ఇది చరిత్ర నేర్పిన గుణపాఠం అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు . ఇలా పగ,ప్రతీకారాలకు పాల్పడే పాలకులు దేశంలో ఎక్కడైనా ఉన్నారా..? ఫాక్షనిస్టు ముఖ్యమంత్రి అయితే పరిపాలనెంత భ్రష్టు పడ్తుందో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితులే ఉదాహరణ అంటూ పోస్ట్ చేస్తున్నారు.

పాలకుల అవినీతిని ప్రశ్నిస్తే కక్ష సాధింపులకు పాల్పడుతారా అంటూ ఫైర్‌ అయ్యారు టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు. ప్రజాస్వాయ్యంలో నాలుగో స్థంభమైన మీడియాపై సీఎం జగన్‌ నియంతలా దాడులు చేస్తున్నారని ట్వీట్‌ చేశారు.

ఇక పాలకుల అవినీతిని, అసమర్థతను ప్రజల దృష్టికి తెచ్చే మీడియా సంస్థల మీద పగబట్టడం ప్రజాస్వామ్యానికే ముప్పని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈనాడు మీద పగబట్టి, ఆ పగను మార్గదర్శి సంస్థలపై తీర్చుకుంటున్న జగన్ రెడ్డి శాడిజాన్ని ప్రజలంతా చూస్తున్నారని హెచ్చరించారు. ప్రజలను చైతన్యం చేస్తున్న మీడియా అధిపతులను వేధించకండి అంటూ లోకేశ్‌ సూచించారు.మీడియా సంస్థలపై జగన్‌ కక్ష సాధింపును ఖండిస్తూ లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story