ధోనీ నుంచి వన్డే కెప్టెన్సీ కోసం కోహ్లీ తొందరపడ్డాడా.. రవిశాస్త్రి ఏం చెప్పాడు.

ధోనీ నుంచి వన్డే కెప్టెన్సీ కోసం కోహ్లీ తొందరపడ్డాడా.. రవిశాస్త్రి ఏం చెప్పాడు.

భారత క్రికెట్ జట్టుకు అత్యధిక విజయాలనందించిన కెప్టెన్లలో మహెంద్రసింగా ధోనీ, విరాట్ కోహ్లీలు ముందు వరసలో వుంటారు. గంగూలీ తర్వాత జట్టును సమర్ధవంతంగా , విజయాల పరంపర దిశగా నడిపించిన నాయకుడు ధోనీనే అనడంలో ఏమాత్రం సందేహం లేదు. టెస్టుల్లోనూ , వన్డేల్లోనూ ధోనీ అందించిన విజయాలు చిరస్మరనీయం కానీ సుదీర్గకాలం పాటు రెండు ఫార్మాట్లలో జట్టుకు నాయకత్వం వహించిన అనంతరం భవిష్యత్ నాయకుడికి అవకాశం కల్పించేందుకు ధోనే నే స్వయంగా టెస్టు కెప్టెన్సీని కోహ్లీకి అప్పగించిన విషయం తెలిసిందే.. కానీ కోహ్లీ కేవలం టెస్టు కెప్టెన్సీకి మాత్రమే పరిమితం కాకుడా వన్డేలకు కూడా తానే కెప్టెన్ కావాలన్న ఉత్సాహం చూపించాడట. దాంతో అప్పటి జట్టు కోచ్ రవిశాస్త్రి కోహ్లీకి తొందరపాటు వద్దని నచ్చజెప్పాల్సివచ్చిందట.


సంయమనం పాటిస్తూ ధోనీ నిర్ణయాన్ని గౌరవిస్తే సరైన సమయంలో ధోనీయే నిన్ను వన్డే కెప్టెన్ గా కూడా ప్రతిపాదిస్తాడని సర్దిచెప్పాడని సమాచారం. ఇప్పటివరకూ బయటకు తెలియని ఈ విషయం గురించి భారత జట్టు మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ తన పుస్తకం "కోచింగ్ బీయాండ్: మై డేస్ విత్ ఇండియన్ క్రికెట్ టీం" ("Coaching Beyond: My Days With Indian Cricket Team") పుస్తకంలో ప్రస్తావించాడట. పుస్తకంలోని 42వ పేజీలో శ్రీధర్ ఈ విషయానిపై చేసిన ప్రస్తావన ఇప్పుడు చర్చనీయాంశమౌతోంది. టెస్ట్ టీం కెప్టెన్ గా కోహ్లీని ప్రకటించిన అనంతరం వన్టేటీం కు సైతం తాను కెప్టెన్ కావాలన్న ఉత్సుకత కోహ్లీమాటల్లో కనిపించిందనీ.. డ్రెస్సింగ్ రూం లో కోహ్లీ ఓ రోజు అదే ధోరణిలో మాట్లాడుతున్నప్పుడు రవిశాస్త్రి జోక్యం చేసుకుని తొందరపాటు తగదనీ, ధోనీ పట్ల నువ్వు గౌరవం చూపితే సరైన సమయం వచ్చినప్పుడు వడ్టే జట్టుకు కూడా కెప్టెన్ గా నిన్నే ధోనీ ప్రతిపాదిస్తాడన్నాడట. అలా చేస్తే భవిష్యత్తులో నీ పట్లకూడా జట్టులోని యువ ఆటగాల్లు గౌరవం పెరుగుతుందని సూచించినట్టు శ్రీధర్ తన పుస్తకంలో రాసుకున్నాడు. రవిశాస్త్రి ఈ మాట చెప్పిన సంవత్సరంలోపే కోహ్లీ వన్డే జట్టుకు కూడా కెప్టెన్ అయ్యాడని పేర్కొన్నాడు.

Read MoreRead Less
Next Story