MS Dhoni : ధోనీపై రూ.15కోట్ల చీటింగ్ కేసు.. అసలేం జరిగిందంటే?

MS Dhoni : ధోనీపై రూ.15కోట్ల చీటింగ్ కేసు.. అసలేం జరిగిందంటే?

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ( Mahendra Singh Dhoni ) ఐపీఎల్ కెరీర్ పై చర్చ నడుస్తున్న సమయంలో అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్. మహీపై రూ.15 కోట్ల చీటింగ్ కేసు నమోదైంది. దాంతో, ఈ కేసుపై అభిప్రాయం తెలపాల్సిందిగా ఆదివారం భారత క్రికెట్ నియంత్రణ మండలి మహీని కోరింది. బీసీసీఐకి చెందిన ఎథిక్స్ కమిటీ ధోనీకి ఆగస్టు 30వ తేదీ వరకూ గడువు విధించింది.

ఉత్తరప్రదేశ్లోని అమేథికి చెందిన రాజేశ్ కుమార్ మౌర్య అనే వ్యక్తి ధోనీ తనను రూ.15 కోట్లు మోసగించాడని బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు. వీసీసీఐ ఎథిక్స్ కమిటీ నిబంధన 36 కింద ఆ కేసును రిజిష్టర్ చేసుకుంది. మిహిరా దివాకర్ అనే వ్యక్తిపై ధోనీ పెట్టిన రూ.15 కోట్ల స్కామ్ కేసుకు దీనికి సంబంధం ఉంది. దాంతో, మహీని రాజేశ్ కుమార్ నమోదు చేసిన ఫిర్యాదుపై స్పందించాల్సింది బీసీసీఐ కోరింది.

ధోనీ పేరుతో క్రికెట్ అకాడమీ నడిపేందుకు అరా స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 2021లో మహీతో ఒప్పందం చేసుకుంది. అయితే.. అగ్రిమెంట్ ప్రకారం ధోనీకి రావాల్సిన డబ్బును అరా కంపెనీ యజమాని సౌమ్యా దాస్ ఇవ్వ లేదు. భారత మాజీ సారథికి అతడు దాదాపు రూ.15 కోట్లు టోకరా వేశాడు. దాంతో, ధోనీ రాంచీ సివిల్ కోర్టులో సౌమ్యాపై కేసు వేశాడు. ఇప్పుడు రాజేశ్ కుమార్.. ధోనీనే తమను మోసం చేశాడంటూ బీసీసీఐకి ఫిర్యాదు చేయడం గమనార్హం.

Tags

Next Story