Naresh Tumda : రోజువారీ కూలీగా మారిన క్రికెట్ వరల్డ్ కప్ విన్నర్..!

Naresh Tumda : ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ పాకిస్తాన్ పైన మ్యాచ్ అంటే ఆ కిక్కే వేరు.. ఇంకా ఆ మ్యాచ్ వరల్డ్ కప్ ఫైనల్ అయి, అందులో ఇండియా గెలిస్తే ఆ కిక్కు డబల్ అవుతుంది. అలా వరల్డ్ కప్ సాధించిన జట్టులో సభ్యుడైన ఓ క్రికెటర్ ఇప్పుడు రోజువారీ కూలీగా మారాడు. అతని పేరు నరేష్ తుమ్డా.. గుజరాత్‌కి చెందిన క్రికెటర్.. 2018లో బ్లైండ్ క్రికెట్ వరల్డ్‌కప్‌ను సాధించిన సభ్యుల్లో నరేష్ తుమ్డా ఒకరు. షార్జాలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా జట్టు పాకిస్తాన్‌ను ఓడించింది. అయితే ఇప్పుడు నరేష్ తుమ్డా కూరగాయలు అమ్ముకోవడంతోపాటు రోజుకు కేవలం 250 రూపాయలకి కూలీ పనికి వెళ్తూ ఆ వచ్చే సంపాదనతో తన కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. "నేను కూలీ పని చేయడం ద్వారా రోజుకు 250 రూపాయలు సంపాదిస్తున్నాను. ఉద్యోగం కోసం మూడుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిని అభ్యర్థించాను.. కానీ అక్కడినుంచి నాకు ఎలాంటి సమాధానం రాలేదు. నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకు ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను" అని నరేష్ తుమ్డా వేడుకుంటున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com