Table Tennis : 24 ఏండ్లకే కెరీర్ కు గుడ్ బై

ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్ లో టేబుల్ టెన్నిస్ భారత మహిళా టీమ్ సత్తా చాటిన సంగతి తెలిసిందే. టేబుల్ టెన్నిస్ మహిళల టీమ్ ఈవెంట్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న తొలి భారత జట్టుగా ఘనత సాధించింది. మన జట్టు ఈ రికార్డును చేరుకోవడంలో 24 ఏళ్ల అర్చనా కామత్ కీలక పాత్ర పోషించింది. అయితే, తాజాగా ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రొఫెషనల్ టేబుల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికింది. అకడమిక్ కెరీర్‌లో ముందుకుసాగడం కోసం ఆటను వదిలిపెట్టినట్లు ఆమె కోచ్ మీడియాకు తెలిపారు.పారిస్ గేమ్స్ ముగించుకొని భారత్‌కు తిరిగొచ్చిన తర్వాత అర్చన తన కెరీర్ గురించి కోచ్ అన్షుల్ గార్గ్‌తో డిస్కస్ చేసినట్లు సమాచారం. నాలుగేళ్ల తర్వాత జరిగే లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ గేమ్స్‌లో పతకం సాధించే అవకాశాలు తక్కువగా ఉండటంతో పాటు ఆర్థిక అవసరాల దృష్ట్యా ఆటకు దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ‘పతకం సాధించడం చాలా కష్టమైన పనే అని నేను చెప్పా. ఆమె వరల్డ్ 100 ర్యాంకుల జాబితాలో లేదు. గత రెండు నెలలుగా ఆమె ఎంతో కష్టపడుతున్నప్పటికీ.. ప్రొఫెషనల్ కెరీర్ కోసం మరింత శ్రమ అవసరం అని వివరించా. దీంతో ఆమె విదేశాలకు వెళ్లి ఉన్నత విద్య చదవాలని నిర్ణయించుకుంది.’ అని కోచ్ వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com