MS Dhoni : మనిషిలో క్షమాగుణం ఉండాలి: ధోనీ

తన ప్రవర్తన ద్వారా మంచి మనిషిగా ఇతరులు గుర్తించుకోవాలని కోరుకుంటున్నట్లు టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ చెప్పారు. మనిషిలో క్షమించే శక్తి ఉండాలని ఓ ఈవెంట్‌లో వ్యాఖ్యానించారు. అయితే చాలా మందిలో అది లేదని, ప్రతీకారం తీర్చుకోవడానికే ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. సమస్య ఏదైనా విరోధులను క్షమించి జీవితంలో ముందుకు సాగుతూ సంతోషంగా ఉండాలన్నారు.
దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు యంగ్ ప్లేయర్స్ ఫోకస్ సరిగ్గా ఉండాలని టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అభిప్రాయపడ్డారు. తమ ప్రాధాన్యత ఏదో గుర్తించాలని యంగ్ ప్లేయర్స్ కు సూచించాడు. "నేను క్రికెట్ పై పూర్తిగా ఫోకస్ పెట్టాను. నాకు మరేదీ ముఖ్యం కాదు. ఒక ఆటగాడిగా నాకు భారత జట్టు తరఫున మంచి ప్రదర్శన ఇవ్వాలనే ఉండేది. ఎందుకంటే దేశం తరఫున ఆడే అవకాశం అందరికీ రాదు. దేశం తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు, ఎంతో ఒత్తిడి ఉంటుంది. ప్రతి మ్యాచ్ లోనూ నానుంచి బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించాను." అని ధోనీ తెలిపాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com