Joe Root : జోరూట్.. బెస్ట్ బ్యాట్స్ మెన్ : ఆకాశ్ చోప్రా

Joe Root : జోరూట్.. బెస్ట్ బ్యాట్స్ మెన్ : ఆకాశ్ చోప్రా

ఇంగ్లండ్‌ ఆటగాడు జో రూట్‌ బెస్ట్ టెస్ట్‌ బ్యాటర్‌ అని టీమిండియా బ్యాట్స్ మెన్, కామెంటర్ ఆకాశ్‌ చోప్రా కితాబిచ్చాడు. ప్రస్తుత క్రికెట్‌ ఫ్యాబ్‌4గా విరాట్‌ కోహ్లీ, కేన్‌ విలియమ్సన్‌, స్టీవ్‌ స్మిత్‌, జో రూట్‌ అని చెబుతుంటారు. కాగా ఇటీవల కాలంలో టెస్టుల్లో చెలరేగిపోతున్న రూట్‌ ఈ ముగ్గురికంటే ముందున్నాడు అని ఆకాశ్‌ పేర్కొన్నాడు. ‘రూట్‌ అద్భుత ప్రదర్శన చేయగల ఆటగాడు.

శ్రీలంకపై రెండో టెస్ట్‌లో సెంచరీ సాధించి.. అత్యధిక శతకాల జాబితాలో 10వ స్థానానికి చేరాడు. ఇదే దూకుడు ప్రదర్శిస్తే అత్యధిక సెంచరీల రికార్డుని బద్దలు కొడతాడనడంలో అనుమానమే లేదు. ఈ సాధారణమైన బ్యాటింగ్‌ వల్లే రూట్‌ ఈ తరంలో అత్యుత్తమ బ్యాటర్‌గా నిలిచాడేమో. టెస్ట్‌ల్లో 34 సెంచరీలు నమోదుచేసిన రూట్‌ ఫ్యాబులస్ క్రికెటర్ల కంటే కొంచెం ముందున్నాడు అనిపిస్తుంది. రూట్‌ అత్యధిక టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడాడు. 145 టెస్ట్‌ల్లో 34 సెంచరీలు నమోదు చేశాడు. అలాగే, కోహ్లీ 113 టెస్ట్‌ల్లో 29 సెంచరీలు, విలియమ్సన్‌ 100 టెస్ట్‌ల్లో 32 సెంచరీలు, స్మిత్‌ 109 టెస్ట్‌ల్లో 32 సెంచరీలు చేశారు. ఈ నలుగురూ స్వదేశంలో అద్భుతమైన టెస్ట్‌ స్కోర్‌లు సాధించారు. అందులోనూ కేన్‌ విలియమ్సన్‌ మిగతావారిని మించిపోయాడు’ అని ఆకాశ్‌ చోప్రా వివరించాడు.

Tags

Next Story