Kohli : కోహ్లీ తండ్రి కావడం లేదు : డివిలియర్స్

మిస్టర్ ఏబీ డివిలియర్స్ (AB Devilliers) మాట మార్చారు. కోహ్లీ (Kohli) రెండోసారి తండ్రి కాబోతుండటంతో ఇంగ్లండ్ టెస్టులకు దూరంగా ఉన్నారని రెండు రోజుల క్రితం చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో కోహ్లీ అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. కానీ ఇప్పుడు డివిలియర్స్ మాట మార్చారు. తాను తప్పుడు సమాచారం ఇచ్చినట్లు పేర్కొ్న్నారు.
అది నిజం కాదని, ఆయన తండ్రి కావడం లేదని చెప్పాడు. కోహ్లీ ఎందుకు విరామం తీసుకున్నాడో తనకు తెలియదని చెప్పాడు. కోహ్లి వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడి పెద్ద తప్పు చేశానని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.
అతడి భార్య అనుష్క గర్భవతి (Anushka) అని.. అందుకే కోహ్లి సెలవు తీసుకున్నాడని కొందరు.. తల్లి అనారోగ్య కారణాల దృష్ట్యానే అతడు ఆటకు దూరమయ్యాడని మరికొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అయితే, తమ తల్లి సరోజ్ ఆరోగ్యంగానే ఉందని కోహ్లి సోదరుడు వికాస్ స్పష్టం చేశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com