Cricket : డివిలియర్స్ రీఎంట్రీ.. ఫ్యాన్స్ లో జోరు

సౌతాఫ్రికా భీకర బ్యాట్స్ మన్ ఏబీ డివిలియర్స్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వరల్డ్ ఛాంఫియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్‌లో ఆడనున్నట్లు స్వయంగా డివిలియర్స్ ప్రకటించారు. దీంతో క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గేమ్ ఛేంజర్స్ సౌత్ ఆఫ్రికా చాంఫియన్స్‌కు ఈ మాజీ విధ్వంసకర ఆటగాడు కెప్టెన్సీగా బాధ్యతలు నిర్వహించనున్నాడు. టీ20 ఫార్మాట్ లో జరగబోయే ఈ టోర్నీలో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లు ఆడతారు. క్రికెట్ కెరీర్‌లో టాప్‌లో వున్నప్పుడే ఏబీ డివిలియర్స్ 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 4 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంతో అతని అభిమానులు చాలా బాధపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినప్పటికి ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ తరపున మరో రెండేళ్లు ఆడాడు. 2021 లో క్రికెట్‌లోని అన్ని రకాల ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు. దాదాపు నాలుగు ఏళ్ల తరువాత డివిలియర్స్ మళ్లీ క్రికెట్ ఆడేందుకు గ్రౌండ్‌లోకి రానున్నడంతో క్రికెట్ అభిమానులు హ్యాపీ ఫీల్ అవుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com