Cricket : టీమిండియా ఫామ్ లోకి రావడం ఖాయం : ఆడమ్ గిల్ క్రిస్ట్

పెర్త్ లో శుక్రవారం నుంచి భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇంట్రాస్క్వాడ్ వార్మప్ మ్యాచ్‌లో పెర్త్ పిచ్ పరిస్థితులపై టీమ్‌ఇండియా ఆటగాళ్లు అవగాహన తెచ్చుకున్నారు. ప్రాక్టీస్ సెషన్స్‌లోనూ తీవ్రంగా సాధన చేస్తున్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ట్రైనింగ్ సెషన్‌ను ప్రత్యక్షంగా చూసిన ఆసీస్ మాజీ ప్లేయర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ కూడా తమ టీమ్ కు హెచ్చరికలు జారీ చేశాడు. కివీస్‌తో టెస్టు సిరీస్ ఓటమితో డీలా పడిందనుకుంటున్న టీమిండియా మళ్లీ ఫామ్ లోకి రావడం ఖాయమని ఈ సందర్బంగా చెప్పుకొచ్చాడు. ‘భారత్ ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉంది. టీమ్ లోని ప్రతిఒక్కరూ విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారిని చూస్తుంటే ఫుల్‌గా ఛార్జ్ అయినట్లు అనిపిస్తోంది. టెస్టు సిరీస్ కోసం సిద్ధమైపోయారు. ఇక ఆస్ట్రేలియా ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. భారత్‌ను అడ్డుకోవడానికి ఆసీస్ చాలా కష్టపడాల్సిందే’ అని గిల్‌క్రిస్ట్ తెలిపాడు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com