Mohammad Nabi : వన్డే ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్..మొహమ్మద్ నబీ నంబర్ వన్

ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు మొహమ్మద్ నబీ ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానానికి దూసుకువచ్చాడు. 410 పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు నంబర్ వన్ స్థానంలో ఉన్న బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ రెండో స్థానానికి పడిపోయాడు.
ఈ స్థానంలో దాదాపు ఐదేళ్ల పాటు కొనసాగాడు షకీబ్. గాయం కారణంగా షకీబ్ వన్డేలకు దూరంగా ఉండటం.. ఈ మధ్యలో నబీ సత్తా చాటడంతో వీరిద్దరి ర్యాంక్‌లు తారుమారయ్యాయి. ఈ విభాగంలో భారత ఆటగాడు రవీంద్ర జడేజా 10వ స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక టెస్ట్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. జడేజా, అశ్విన్, అక్షర్ 1, 2, 5 స్థానాల్లో కొనసాగుతున్నారు. టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ టాప్‌లో కొనసాగుతుండగా.. యశస్వి జైస్వాల్ ఆరో ప్లేస్‌లో నిలిచాడు.
టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్ లో ఆదిల్ రషీద్ టాప్‌లో కొనసాగుతుండగా.. భారత బౌలర్లు అక్షర్ పటేల్, రవి భిష్ణోయ్ ఐదు, ఆరు స్థానాల్లో నిలిచారు. టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు విరాట్ ఏడులో, పంత్, రోహిత్ శర్మ 12, 13 స్థానాల్లో నిలిచారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com