Virat Kohli Tweet : శిఖర్.. నీ లెగసీని కొనసాగిస్తాం .. విరాట్ కోహ్లీ ట్వీట్

Virat Kohli Tweet : శిఖర్.. నీ లెగసీని కొనసాగిస్తాం .. విరాట్ కోహ్లీ ట్వీట్
X

ఇంటర్నేషనల్, దేశీయ క్రికెట్ కు శిఖర్ ధావన్ గుడ్ బై చెప్పడం క్రికెట్ ఫ్యాన్స్ ను షాక్ కు నిరాశకు గురిచేసింది. శిఖర్ ధావన్ రిటైర్మెంట్ పై టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ‘ఎక్స్’లో ఓ పోస్ట్ పెట్టాడు.‘శిఖర్.. అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో.. ఘనంగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నమ్మదగిన ఓపెనర్లలో ఒకడిగా మారే వరకూ నీ ప్రయాణంలో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆటపై నీకున్న ఇష్టం, క్రీడా స్ఫూర్తి అద్భుతం. నీ ట్రేడ్‌మార్క్‌ నవ్వును మిస్‌ అవుతున్నాం. నీ లెగసీని కొనసాగిస్తాం. మంచి జ్ఞాపకాలను అందించావు. మంచి మనసుతో మమ్మల్ని నడిపించావు. నీ జీవితం అద్భుతంగా కొనసాగాలని కోరుకుంటున్నా’ అని కోహ్లీ పోస్ట్ చేశాడు.

Tags

Next Story