Cricket : కేకేఆర్ కెప్టెన్ గా అజింక్య రహానె : కేకేఆర్ సీఈవో
ఐపీఎల్ మెగా వేలం సందర్భంగా యాజమాన్యాలు తమ జట్లను బలోపేతం చేసుకునే దిశగా, ఆటగాళ్ల నైపుణ్యాలను బట్టి ఎంపిక చేసుకున్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్ మినహా దాదాపు అన్ని జట్లకు కెప్టెన్లు దొరికినట్లుగానే కనిపిస్తోంది. గతేడాది కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ ఈ సారి వేలంలోకి వెళ్లాడు. అతడిని వేలంలో పంజాబ్ రూ.26.75 కోట్లకు సొంతం చేసుకుంది. ప్రస్తుతం రసెల్, నరైన్ సీనియర్లుగా ఉన్నారు. కానీ వీరిని కెప్టెన్ చేసే అవకాశాలు చాలా తక్కువ. ఇక, కొన్నాళ్ల నుంచి కేకేఆర్ తరఫున ఆడుతున్న వెంకటేశ్ అయ్యర్ ను తిరిగి దక్కించుకుంది. అతడి కోసం కోల్‌కతా ఏకంగా రూ.23.75 కోట్లు వెచ్చించింది. కానీ, అతడికి కెప్టెన్సీ అనుభవం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే చివరి నిమిషంలో అజింక్య రహానె ను కేకేఆర్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మొదటి రోజు అమ్ముడుపోని రహానెను.. రెండో రోజు వేలంలో కనీస ధర రూ.1.75 కోట్లకు కోల్‌కతా తీసుకుంది. కెప్టెన్ కోసమే అతడిని కొనుగోలు చేసినట్లు క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. రహానె 2022లో కోల్‌కతా తరఫున ఏడు మ్యాచ్‌లు ఆడి 133 పరుగులు చేశాడు
ఇలాంటి తరుణంలో కోల్‌కతా కెప్టెన్సీ అంశంపై కేకేఆర్ ఫ్రాంఛైజీ సీఈవో వెంకీ మైసూర్ తాజాగా స్పందించారు. రహానెను కెప్టెన్ చేయాలా? వద్దా అనే దానిపై ఫ్రాంఛైజీలో భాగస్వాములుగా ఉన్న వాటాదారులందరూ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు. వేలంలో తమ ప్లాన్‌ను సరిగ్గా అమలు చేశామని, జట్టు చాలా అద్భుతంగా ఉందని వెంకీ మైసూర్ చెప్పుకొచ్చారు. అనుకున్న విధంగా అన్ని విభాగాల్లో మంచి ఆటగాళ్లు పొందినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
కోల్‌కతా జట్టు: వెంకటేశ్ అయ్యర్, రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, రసెల్, అన్రిచ్ నోకియా, హర్షిత్ రాణా, రమణ్‌దీప్ సింగ్, క్వింటన్ డికాక్, రఘువంశీ, స్పెన్సర్ జాన్సన్, రెహ్మనుల్లా గుర్బాజ్, మొయిన్ అలీ, వైభవ్ అరోరా, అజింక్య రహానె, రొవ్‌మన్ పావెల్, ఉమ్రాన్ మలిక్, మనీశ్ పాండే, అనుకుల్ రాయ్, లవ్‌నిత్ సిసోడియా, మయాంక్ మార్కండె.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com