Rohit and Kohli : అందరి చూపు కోహ్లీ, రోహిత్ పైనే..! ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రిపరేషన్స్

Rohit and Kohli : అందరి చూపు కోహ్లీ, రోహిత్ పైనే..! ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రిపరేషన్స్
X

శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ లో శుక్రవారం (ఆగస్టు 2) తొలి వన్డే, ఆదివారం (ఆగస్ట్ 4) రెండో వన్డే, బుధవారం (ఆగస్ట్ 7) మూడో వన్డే జరగనున్నాయి. సోమవారమే లంకకు చేరిన టీమిండియా స్టార్ ప్లేయర్లు కోహ్లి, రోహిత్ ప్రాక్టీస్ లో బిజీగా ఉన్నారు.

విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు శ్రీలంకపై మంచి రికార్డ్ ఉంది. రోహిత్.. శ్రీలంకపై రెండు డబుల్ సెంచరీలు బాదగా కోహ్లి చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ లు ఆడాడు. పైగా కోహ్లి బ్యాటింగ్ శైలికి వన్డే ఫార్మాట్ సరిగ్గా సరిపోతుంది.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ.. సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ ఇస్తుండటం.. అచ్చొచ్చిన ఫార్మాట్లో బరిలోకి దిగుతుండటంతో సెంచరీల మోత మోగిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ సిరీస్ తోనే టీమిండియా ఛాంపియన్స్ 2025 ట్రోఫీ సన్నాహకాలు ప్రారంభం కానున్నాయి. పాకిస్థాన్ వేదికగా వచ్చే ఏడాది వన్డే ఫార్మాట్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది.

Tags

Next Story