WI vs Aus : బీభత్సం ... 29 బంతుల్లో 71 రన్స్ కొట్టాడు
వెస్టిండీస్ హిట్టర్ ఆండ్రీ రస్సెల్ (Andre Russell ) బీభత్సం సృష్టించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో కంగారు బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 29 బంతుల్లో 71 రన్స్ కొట్టాడు ఇందులో 7 సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని 79 పరుగులకు తన జట్టు 5 వికెట్లు కోల్పోయి కష్టా్ల్లో ఉన్నప్పుడు క్రీజ్ లోకి వచ్చిన రస్సెల్ ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.
రస్సెల్ కు తోడు... షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ కూడా రెచ్చిపోయాడు.40 బంతుల్లో 67 పరుగులు చేశాడు. ఇద్దరు కలిసి ఆరో వికెట్‌కు 140 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో వెస్టిండీస్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. 3 మ్యాచ్‌లలో రస్సెల్ 36.33 సగటుతో మరియు 231.91 స్ట్రైక్-రేట్‌తో 109 పరుగులు చేశాడు.
ఆస్ట్రేలియా బౌలర్లలో జేవియర్ బార్ట్‌లెట్ 2 వికెట్లు తీయగా... జాసన్ బెహ్రెండాఫ్, స్పెన్సర్ జాన్సన్, ఆరోన్ హార్ది, ఆడమ్ జంపా తలో వికెట్ తీశారు. కాగా మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఆస్ట్రేలియా జట్టు రెండు మ్యాచ్ లు గెలిచి ముందంజలో ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com