గ్రేట్ నీరజ్ చోప్రా.. మరో అరుదైన గౌరవం

నీరజ్ చోప్రా (Neeraj chopra) ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం లభించింది. స్విట్జర్లాండ్‌లోని 'టాప్ ఆఫ్ యూరోప్'గా పిలవబడే జంగ్‌ఫ్రౌజోచ్‌లోని ప్రసిద్ధ ఐస్ ప్యాలెస్‌లో ఫలకంతో సత్కరించారు. కళ్లుచెదిరే అద్భుతమైన ఐస్ ప్యాలెస్‌లో తన ఫలకాన్ని పెట్టడం చాలా గౌరవంగా భావిస్తున్నానని నీరజ్ చోప్రా ఉద్వేగంగా చెప్పాడు.
చోప్రా సాధించిన అద్భుత విజయాలను ఈ వేడుకలో వివరిస్తూ అభినందనలతో ముంచెత్తారు. జంగ్‌ఫ్రౌజోచ్‌లో ఈ మేరకు ఓ స్మారక ఫలకాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని సందర్శించిన చోప్రా విజిట్ చేసి ఉద్వేగంగా మాట్లాడారు. తను ఉపయోగించిన అనేక జావెలిన్ లలో ఒకదాన్ని స్విస్ టూరిజమ్ డిపార్టెమెంట్‌కు గిఫ్ట్‌గా ఇచ్చాడు. దాన్ని స్మారక ఫలకం పక్కనే ఉంచారు.
ఇది చాలా అరుదుగా జరిగే సన్మానం. అలాంటి ఫీట్ ను నీరజ్ చోప్రా దక్కించుకు్ననాడు. టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెడరర్, గోల్ఫ్ ప్లేయర్ రోరె మెక్‌ల్ రాయ్ కూడా ఇక్కడ మెమోరియల్ లు ఉన్నాయి. వెలకట్టలేని ప్లేయర్ల ప్రాక్టీస్, అంకితభావానికి నిదర్శనంగా జంగ్‌ఫ్రౌజోచ్ 'వాల్ ఆఫ్ ఫేమ్' నిలుస్తుందని స్విస్ టూరిజమ్ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com