Ravichandran Ashwin : అశ్విన్ సరికొత్త రికార్డు
రత స్పిన్ ఆల్‌రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా బంగ్లాతో సిరీస్‌లో అదరగొట్టేస్తున్నారు. చెపాక్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన అశ్విన్.. రెండో టెస్టులోనూ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో వరుసగా మూడు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ సైకిళ్లలో 50+ వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు. డబ్ల్యూటీసీ 2019-21 సీజన్‌లో 14 మ్యాచుల్లో 71 వికెట్లు, 2021-23 సీజన్‌లో 61, 2023-25 సీజన్‌లో ఇప్పటి వరకు 50 వికెట్లు పడగొట్టాడు. టెస్టు క్రికెట్‌లో 300 వికెట్లు తీసిన ఏడో భారత బౌలర్‌గా రవీంద్ర జడేజా నిలిచాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో రిటర్న్ క్యాచ్‌తో వికెట్ తీసిన జడేజా ఈ ఫీట్‌ను సాధించాడు. అతడి కంటే ముందు అనిల్ కుంబ్లే (619), అశ్విన్ (524), కపిల్ (434), హర్భజన్ (417), ఇషాంత్ శర్మ (311), జహీర్ ఖాన్ (311) ఉన్నారు. ఈ క్రమంలోనే జడేజా భారత్ తరఫునే కాకుండా ఆసియాలోనే టెస్టుల్లో వేగంగా 3000 పరుగులు చేయడంతోపాటు 300 వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com