ASIA CUP: దాయాదుల సమరం చుట్టూ సంవాదం

ASIA CUP: దాయాదుల సమరం చుట్టూ సంవాదం
X
భారత్-పాక్ మ్యాచ్ చుట్టూ వివాదాలు.. మ్యాచ్ నిషేధించాలంటూ డిమాండ్లు.. కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు.. సెప్టెంబర్ 14న భారత్-పాక్ మ్యాచ్

ఆసి­యా కప్ 2025 సె­ప్టెం­బ­ర్ 9న ప్రా­రం­భ­మైం­ది. భా­ర­త్ తొలి మ్యా­చు­లో ఘన వి­జ­యం కూడా సా­ధిం­చే­సిం­ది. యూ­ఏ­ఈ­ను చి­త్తు­చి­త్తు­గా ఓడిం­చి తద­పు­రి సమ­రా­ని­కి భారత జట్టు సి­ద్ధ­మైం­ది. భా­ర­త్ తన తర్వా­తి మ్యా­చ్ దా­యా­ది పా­కి­స్థా­న్‌­తో ఆడ­నుం­ది. ఈ హై-వో­ల్టే­జ్ మ్యా­చ్ సె­ప్టెం­బ­ర్ 14న దు­బా­య్ ఇం­ట­ర్నే­ష­న­ల్ స్టే­డి­యం­లో జర­గ­నుం­ది. పహ­ల్గా­మ్ ఉగ్ర­దా­డి తర్వాత ఈ మ్యా­చ్ గు­రిం­చి చాలా సం­దే­హా­లు తలె­త్తా­యి. అయి­తే ఆప­రే­ష­న్ సిం­ధూ­ర్ తర్వాత పా­క్‌­తో అన్ని సం­బం­ధా­లు తెం­పు­కు­న్న భా­ర­త్... ఇప్పు­డు దా­యా­ది­తో క్రి­కె­ట్ మ్యా­చు­కు సి­ద్ధం కా­వ­డం తీ­వ్ర వి­మ­ర్శ­ల­కు తా­వి­స్తోం­ది.

ఆగ్రహించిన సుప్రీం

ఆసి­యా కప్‌­లో భా­ర­త్‌-పా­క్‌ మ్యా­చ్‌ రద్దు చే­యా­లం­టూ దా­ఖ­లైన పి­టి­ష­న్‌­పై సు­ప్రీం కో­ర్టు ఆగ్ర­హం వ్య­క్తం చే­సిం­ది. దా­ని­ని అత్య­వ­స­రం­గా వి­చా­రిం­చా­ల­ని పి­టి­ష­న­ర్లు కో­ర­గా అత్యు­న్నత న్యా­య­స్థా­నం ఈ వి­ధం­గా స్పం­దిం­చిం­ది. ‘అంత అత్య­వ­స­రం ఏమి­టి? అది కే­వ­లం ఒక మ్యా­చ్‌. అలా జర­గ­ని­వ్వం­డి. మ్యా­చ్‌ ఆది­వా­రం ఉంది. ఏం చే­యా­లి?’ అని జస్టి­స్‌ జేకే మహే­శ్వ­రి, జస్టి­స్‌ వి­జ­య్‌ బి­ష్ణో­య్‌ల ధర్మా­స­నం పి­టి­ష­న్‌ దా­ఖ­లు చే­సిన న్యా­య­వా­ది­ని ప్ర­శ్నిం­చిం­ది. ఆది­వా­రం మ్యా­చ్‌ ఉం­ద­ని, శు­క్ర­వా­రం జా­బి­తా­లో చే­ర్చ­క­పో­తే పి­టి­ష­న్‌ ని­ష్ఫ­ల­మ­వు­తుం­ద­ని న్యా­య­వా­ది కో­ర్టు­కు తె­లి­పా­రు. ఉర్వ­శి జైన్ తో పాటు నలు­గు­రు న్యాయ వి­ద్యా­ర్థు­లు రా­జ్యాం­గం­లో­ని ఆర్టి­క­ల్ 32 కింద ఈ పి­టి­ష­న్‌­ను దా­ఖ­లు చే­శా­రు. పా­కి­స్థా­న్‌­తో క్రి­కె­ట్ మ్యా­చ్ ని­ర్వ­హిం­చ­డం ప్ర­జల భా­వా­ల­కు వి­రు­ద్ధ­మ­ని పి­టి­ష­న్‌­లో పే­ర్కొ­న్నా­రు.

బీసీసీఐ ఏమన్నదంటే..?

భా­ర­త్-పా­కి­స్థా­న్ మ్యా­చ్‌­ల­ను రద్దు చే­యా­ల­ని లేదా బహి­ష్క­రిం­చా­ల­ని పి­లు­పు­ని­వ్వ­డం ఇది మొ­ద­టి­సా­రి కాదు. అయి­తే, బీ­సీ­సీఐ తన వై­ఖ­రి­ని స్ప­ష్టం చే­స్తూ, కేం­ద్ర ప్ర­భు­త్వ వి­ధా­నా­ని­కి కట్టు­బ­డి ఉం­టా­మ­ని తె­లి­పిం­ది. కేం­ద్రం బహుళ-దే­శాల టో­ర్న­మెం­ట్‌­ల­లో పా­ల్గొ­న­డా­ని­కి అను­మ­తి­స్తుం­ది కానీ పా­కి­స్థా­న్‌­తో ద్వై­పా­క్షిక సి­రీ­స్‌­ల­ను మా­త్రం పరి­మి­తం చే­సిం­ది. బీ­సీ­సీఐ కా­ర్య­ద­ర్శి దే­వ­జి­త్ సై­కి­యా ఇటీ­వల మా­ట్లా­డు­తూ.. బహుళ-దే­శాల టో­ర్న­మెం­ట్ల­ను బహి­ష్క­రి­స్తే ఆసి­యా క్రి­కె­ట్ కౌ­న్సి­ల్ లేదా ఐసీ­సీ వంటి అం­త­ర్జా­తీయ సం­స్థల నుం­చి ఆం­క్ష­లు ఎదు­ర్కో­వా­ల్సి వస్తుం­ద­ని, ఇది భారత ఆట­గా­ళ్ల కె­రీ­ర్‌­కు నష్టం చే­కూ­రు­స్తుం­ద­ని అన్నా­రు.

ఈ చర్చకు అంతు లేదు

ఆసి­యా కప్ 2025 షె­డ్యూ­ల్ ప్ర­క­టిం­చి­న­ప్ప­టి నుం­చి భా­ర­త్-పా­కి­స్థా­న్ మధ్య రా­జ­కీయ సం­బం­ధా­లు క్షీ­ణిం­చిన నే­ప­థ్యం­లో ఈ మ్యా­చ్ అవ­స­ర­మా అనే చర్చ మొ­ద­లైం­ది. ము­ఖ్యం­గా పహ­ల్గాం దాడి, దాని తర్వాత జరి­గిన ఆప­రే­ష­న్ సిం­ధూ­ర్ వంటి సం­ఘ­ట­నల తర్వాత ఈ వి­వా­దం మరింత పె­రి­గిం­ది. పా­కి­స్తా­న్‌­ను క్రి­కె­ట్ ప్ర­పం­చం నుం­చి పూ­ర్తి­గా బహి­ష్క­రిం­చ­డం ఎం­దు­కు సా­ధ్యం కాదో దేవ్ జీత్ సై­కి­యా వి­వ­రిం­చా­రు. బహుళ-జట్ల టో­ర్న­మెం­ట్‌­ల­లో పా­కి­స్తా­న్‌­తో ఆడ­టా­ని­కి ని­రా­క­రి­స్తే, ఆసి­యా క్రి­కె­ట్ కౌ­న్సి­ల్ (ACC) లేదా అం­త­ర్జా­తీయ క్రి­కె­ట్ కౌ­న్సి­ల్ (ICC) కఠిన చర్య­లు తీ­సు­కు­నే అవ­కా­శం ఉంది. దీ­ని­వ­ల్ల బీ­సీ­సీ­ఐ­పై ని­షే­ధం పడే అవ­కా­శం ఉంది. ఇది యువ క్రీ­డా­కా­రుల భవి­ష్య­త్తు­కు ఏ మా­త్రం మం­చి­ది కా­ద­న్న అభి­ప్రా­యా­లు వ్య­క్త­మ­వు­తు­న్నా­యి.

Tags

Next Story