ASIA CUP: ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించిన భారత్

41 ఏళ్ల ఆసియా కప్ టోర్నీ చరిత్రలోనే తొలిసారి ఫైనల్ లో తలపడ్డ ఇరుజట్లలో టీమ్ ఇండియా దే పైచేయి. ఫైనల్ ఇన్నింగ్స్ లో 5 వికెట్ల తేడాతో గెలిచింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 69 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ ను దగ్గరుండి గెలిపించాడు. మరుపురాని విజయాన్ని సాధించిన తర్వాత భారత్ జట్టు మాత్రం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తన తొమ్మిదో ఆసియా కప్ టైటిల్ ను తీసుకోవడానికి నిరాకరించింది. పాక్ మంత్రి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ఇస్తుండడమే దీనికి కారణం. వాళ్ళకు షేక్ ఇవ్వడానికే తాము ఒప్పుకోలేదని దీనికి ఎలా ఒప్పుకుంటామంటూ ట్రోఫీ , మెడల్స్ తీసుకోకుండానే టీమ్ ఇండియా ఆటగాళ్ళు డగౌట్ కు చేరుకున్నారు.
మాకేం వద్దు మీరే ఉంచుకోండి
పాక్ మంత్రి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ఇస్తుండడంతో ట్రోఫీని తీసుకోవడానికి పాక్ నిరాకరించింది. ట్రోఫీ, మెడల్స్ తీసుకోకుండా టీమ్ఇండియా దూరంగా ఉండిపోయారు. దీంతో భారత్ ట్రోఫీని నిరాకరించినట్లు ప్రెసెంటేటర్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో గ్రౌండ్‌కు తీసుకొచ్చిన ట్రోఫీని వెనక్కి తీసుకెళ్లారు. భారత ఆటగాళ్లు ట్రోఫీ లేకుండానే సెలబ్రేషన్ష్ చేసుకున్నారు. ఇక ట్రోఫీ గెలిచిన భారత్‌కు రూ.21 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. ఆటగాళ్లు, సిబ్బందికి ఈ డబ్బులు ఇవ్వనున్నారు.
ఎదురుచూసిన పాక్ మంత్రి
పాకిస్తాన్ మంత్రి నఖ్వీ చాలా సేపు ఎదురు చూస్తూనే ఉన్నారు కానీ భారత ఆటగాళ్ళు మాత్రం పోడియం మీదకు రాలేదు. ఫోన్లు చూస్తూ కిందనే కాలక్షేపం చేశారు. భారత్ ట్రోఫీని నిరాకరించినట్లు ప్రెసెంటేటర్ ప్రకటించారు. చివరకు నఖ్వీ ట్రోఫీని తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తరువాత టీమ్ ఇండియా ఆటగాళ్ళు పోడియం దగ్గరకు వచ్చి సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ..తమ విజయంతో దేశం మొత్తం సంబరాలఉ చేసుకుంటుందని అన్నాడు. మ్యాచ్ తరువాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ పాల్గొన్నారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో ట్రోఫీని తీసుకోకపోవడంపై సమాధానం ఇస్తూ..తన కెరీర్ లో ఒక విజేత జట్టు ట్రోఫీని నిరాకరించడం ఇదే మొదటి సారని స్కై అన్నాడు. తాము అన్ని రకాలుగా అర్హులే అయినప్పటికీ...కావాలనే తిరస్కరించామని చెప్పాడు. మిగతా ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పకుండా దాటవేశాడు.
పహల్గాం ఉగ్రదాడి బాధితులతోపాటు సైన్యానికి ఈ విజయం అంకితం చేస్తున్నట్లు ప్రకటన చేయడంతో పాక్‌కు గాయంపై కారం పోసినంత పనైంది చచ్చీచెడి పాక్ ఫైనల్ చేరడంతో.. ఇక చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్‌కు మళ్లీ క్రేజ్ వచ్చింది. దీంతో ఫైనల్ మ్యాచ్‌కు స్టేడియం నిండిపోయింది. ఇక భారత్ ఫైనల్లో గెలిస్తే ఆ దేశం నుంచి ట్రోఫీతీసుకోవడానికి భారత్ నిరాకరించవచ్చనే వార్తలు వచ్చాయి. అనుకున్నట్లుగానే భారత్ పాక్ మంత్రి నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించింది. దీంతో ఏ వివాదం చెలరేగుతుందో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com