ASIA CUP: ఆసియా కప్ వేదికగా పాకిస్థాన్ డ్రామాలు

ASIA CUP: ఆసియా కప్ వేదికగా పాకిస్థాన్ డ్రామాలు
X
మ్యాచ్ బహిష్కరిస్తామంటూ ప్రగల్భాలు.,..ఐసీసీ హెచ్చరికలతో దిగొచ్చిన పాకిస్థాన్... మ్యాచ్ రిఫరీ సారీ చెప్పారంటూ ప్రకటన.. సారీ వీడియో అంటూ నెట్టింట పాక్ పోస్ట్

ఆసి­యా కప్ 2025లో అను­కొ­ని పరి­ణా­మా­లు చోటు చే­సు­కుం­టు­న్నా­యి. ము­ఖ్యం­గా ‘హ్యాం­డ్ షేక్’ వి­వా­దం నే­ప­థ్యం­లో పా­కి­స్తా­న్ జట్టు హై­డ్రా­మా చే­స్తోం­ది. యు­నై­టె­డ్ అరబ్ ఎమి­రే­ట్స్‌­తో జర­గా­ల్సిన మ్యా­చ్ సమ­యా­ని­కి పా­కి­స్తా­న్ జట్టు దు­బా­య్ ఇం­ట­ర్నే­ష­న­ల్ క్రి­కె­ట్ స్టే­డి­యం­కి రా­వా­ల్సి ఉం­డ­గా ఆట­గా­ళ్లు అం­ద­రూ హో­ట­ల్ రూ­మ్‌­కే పరి­మి­త­మైం­ది. భా­ర­త్ తో జరి­గిన మ్యా­చ్ లో.. మ్యా­చ్ ము­గి­సిన తర్వాత హ్యాం­డ్ షేక్ ఇవ్వ­ని కా­ర­ణం­గా పా­కి­స్థా­న్ జట్టు ఈ వి­ధం­గా ని­ర­సన తె­లి­పిం­ది. మ్యా­చ్ కు మొదట పా­కి­స్తా­న్ జట్టు దూ­రం­గా ఉం­ద­ని అం­ద­రు భా­విం­చా­రు. అయి­తే, ఇక్కడ ఓ కొ­త్త ట్వి­స్ట్ జరి­గిం­ది. ఏమైం­దో ఏమో తె­లి­య­దు కానీ.. పా­కి­స్తా­న్ జట్టు మళ్లీ మనసు మా­ర్చు­కు­ని మ్యా­చ్ ఆడి గె­లి­చి సూ­ప­ర్ 4కు చే­రు­కుం­ది.

వందల కోట్ల జరిమానా భయం.!

మ్యా­చ్ రి­ఫ­రీ ఆండీ పై­క్రా­ఫ్ట్‌­ను తొ­ల­గిం­చా­ల­ని లే­క­పో­తే తాము ఆడ­బో­మ­ని భీ­ష్మిం­చు­కు­ని కూ­ర్చు­న్న పాక్ చి­వ­రి­కి .. చె­రు­వు మీద అలి­గి­తే తమకే కష్ట­మ­నే ని­ర్ణ­యా­ని­కి వచ్చి మ్యా­చ్ ఆడి గె­లి­చిం­ది. మ్యా­చ్ రి­ఫ­రీ­ని కనీ­సం తమ మ్యా­చ్ కు తొ­ల­గిం­చ­పో­యి­నా సరే వచ్చి మ్యా­చ్ ఆడిం­ది. మ్యా­చ్ రి­ఫ­రీ సారీ చె­ప్పా­డ­ని చె­ప్పి మ్యా­చ్ కు హా­జ­రైం­ది. యూ­ఏ­ఈ­తో మ్యా­చ్ ఆల­స్యం­గా ప్రా­రం­భ­మ­యిం­ది. రి­ఫ­రీ­తో సారీ చె­ప్పిం­చి­నా సరే­న­ని పాక్ కా­ళ్ల బే­రా­ని­కి వచ్చిం­ది. రి­ఫ­రీ .. దా­ని­కి అఅం­గీ­కి­రం­చ­డం­తో పా­కి­స్తా­న్ టీమ్ స్టే­డి­యా­ని­కి వచ్చిం­ది. పాక్ మ్యా­చ్ ఆడ­క­పో­తే ఐసీ­సీ రూ.100 కో­ట్ల జరి­మా­నా ఎదు­ర్కో­నుం­ద­న్న వా­ర్త­లు కూడా వచ్చా­యి. మ్యాచ్ తర్వాత, భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తోపాటు టీమ్ మొత్తం పాక్ ప్లేయర్లతో హ్యాండ్‌షేక్ చేయకపోవడం వివాదాస్పదమైంది.

రంగంలోకి దిగిన ఐసీసీ

యూ­ఏ­ఈ­తో మ్యా­చ్‌­ను పా­క్‌ బహి­ష్క­రిం­చ­నుం­ద­న్న వా­ర్త­లు వె­లు­వ­డ్డా­యి. అయి­తే, పా­క్‌ బో­ర్డు (పీ­సీ­బీ) చై­ర్మ­న్‌ మొ­హి­సి­న్‌ నఖ్వీ­తో కా­న్ఫ­రె­న్స్‌ కా­ల్‌­లో మా­ట్లా­డిన ఐసీ­సీ సీ­ఈ­వో సం­జో­గ్‌ గు­ప్తా.. మ్యా­చ్‌ రె­ఫ­రీ­గా పై­క్రా­ఫ్ట్‌ కొ­న­సా­గు­తా­డ­ని మరో­సా­రి స్ప­ష్టం చే­శా­డు. అతడు ఎలాం­టి ని­బం­ధ­న­లు ఉల్లం­ఘిం­చ­లే­ద­ని గు­ర్తు చే­శా­డు.పై­క్రా­‌­ఫ్ట్‌­ను కూడా హె­డ్‌ క్వా­ర్ట­ర్స్‌­కు పి­లి­పిం­చిన ఐసీ­సీ.. అతని వి­ష­యం­లో పూ­ర్తి­గా వి­చా­రణ చే­సి­న­ట్టు రా­త­పూ­ర్వ­కం­గా పీ­సీ­బీ­కి తె­లి­య­జే­సిం­ది. ఈ క్ర­మం­లో పలు­మా­ర్లు నఖ్వీ­తో మం­త­నా­లు జరి­పిన పా­క్‌ జట్టు చి­వ­ర­కు స్టే­డి­యా­ని­కి చే­రు­కొం­ది. దీం­తో మ్యా­చ్‌ గంట ఆల­స్యం­గా మొ­ద­లైం­ది. మరో­వై­పు భా­ర­త్‌­తో జరి­గిన మ్యా­చ్‌­లో చోటు చే­సు­కొ­న్న పరి­ణా­మా­ల­పై పా­క్‌ మే­నే­జ­ర్‌­ను పై­క్రా­ఫ్ట్‌ క్ష­మా­ప­ణ­లు కో­రి­న­ట్టు పీ­సీ­బీ ఎక్స్‌­లో పో­స్టు చే­సిం­ది. కాగా, మ్యా­చ్‌­ను బహి­ష్క­రి­స్తే భారీ జరి­మా­నా­లు తప్ప­వ­న్న భయం­తో­నే పా­క్‌ దా­రి­కొ­చ్చి­న­ట్టు తె­లు­స్తోం­ది. బు­ధ­వా­రం రా­త్రి జరి­గిన గ్రూ­ప్ ఏ మ్యా­చ్‌­లో యూ­ఏ­ఈ­పై 41 పరు­గుల తే­డా­తో పా­కి­స్తా­న్ వి­జ­యం సా­ధిం­చిం­ది. తొ­లుత బ్యా­టిం­గ్ చే­సిన పా­కి­స్థా­న్ 20 ఓవ­ర్ల­లో 9 వి­కె­ట్ల నష్టా­ని­కి 146 పరు­గు­లు చే­య­గా.. లక్ష్య ఛే­ద­న­లో యూఏఈ తడ­బ­డిం­ది. 17.4 ఓవ­ర్ల­లో 105 పరు­గు­ల­కే ఆలౌ­ట్ అయిం­ది. ఈ వి­జ­యం­తో పా­కి­స్థా­న్ గ్రూ­ప్ ఏలో మొ­ద­టి రెం­డు స్థా­నా­ల్లో ని­లి­చి సూ­ప­ర్ 4లో తన స్థా­నా­న్ని ఖరా­రు చే­సు­కుం­ది. దీంతో భారత్ తో పాక్ ఈ నెల 21వ తేదీన ఈ మ్యాచ్ జరుగనుంది.

Tags

Next Story