ASIA CUP: భారీ మార్పులతో బరిలోకి టీమిండియా

ASIA CUP: భారీ మార్పులతో బరిలోకి టీమిండియా
X
నేడు ఒమన్‌తో భారత్ నామమాత్రపు పోరు.. ఇప్పటికే సూపర్ 4 చేరిన టీమిండియా.. బుమ్రాకు రెస్ట్.. బరిలో హర్ష్‌దీప్ సింగ్.. హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇస్తారని టాక్

ఆసి­యా కప్ 2025లో వరుస వి­జ­యా­ల­తో దూ­సు­కె­ళ్తు­న్న టీ­మిం­డి­యా ఇప్పు­డు లీగ్ దశలో తమ చి­వ­రి మ్యా­చ్‌­లో ఒమ­న్‌­తో నేడు తల­ప­డ­నుం­ది. ఇప్ప­టి­కే యూఏఈ, పా­కి­స్థా­న్‌­ల­ను ఓడిం­చి సూ­ప­ర్-4లో తమ స్థా­నా­న్ని ఖాయం చే­సు­కు­న్న భారత జట్టు, ఒమ­న్‌­తో జరి­గే ఈ మ్యా­చ్‌­లో భారీ మా­ర్పు­ల­తో బరి­లో­కి దిగే అవ­కా­శం ఉంది. ము­ఖ్యం­గా ప్ర­ధాన ఆట­గా­ళ్ల­కు వి­శ్రాం­తి ఇచ్చి.. బెం­చ్ పై ఉన్న­వా­రి­కి అవ­కా­శం ఇవ్వా­ల­నే ఆలో­చ­న­లో టీమ్ మే­నే­జ్మెం­ట్ ఉన్న­ట్లు తె­లు­స్తోం­ది. గత రెం­డు మ్యా­చ్‌­లో భా­ర­త్.. బ్యా­టిం­గ్ డె­ప్త్‌­పై ఫో­క­స్ చే­సిం­ది. 8 మంది బ్యా­ట­ర్ల­ను తుది జట్టు­లో­కి తీ­సు­కుం­ది. కానీ ఒమ­న్‌­తో మ్యా­చ్‌­లో తుది జట్టు­లో మా­ర్పు­లు చేసే అవ­కా­శం కని­పి­స్తోం­ది. ఒమన్ జట్టు భా­ర­త్‌­కు పోటీ ఇచ్చే కూడా అవ­కా­శం లేదు. అం­దు­వ­ల్ల వి­జ­యం లాం­ఛ­న­మే. ఈ నే­ప­థ్యం­లో ఈ మ్యా­చ్‌­లో టీ­మిం­డి­యా మా­ర్పు­ల­తో బరి­లో­కి దిగే అవ­కా­శం కని­పి­స్తోం­ది.

బుమ్రాకు విశ్రాంతి

ఒమ­న్‌­తో జరి­గే మ్యా­చు­లో స్టా­ర్ పే­స­ర్ జస్‌­ప్రీ­త్ బు­మ్రా­కు వి­శ్రాం­తి ఇచ్చే అవ­కా­శం ఉంది. ఎం­దు­కం­టే ఆసి­యా­క­ప్ తర్వాత భా­ర­త్.. వె­స్టిం­డీ­స్‌­తో టె­స్ట్ సి­రీ­స్ ఆడ­నుం­ది. ఈ సి­రీ­స్‌­కు బు­మ్రా­ను ఫ్రె­ష్‌­గా ఉం­చేం­దు­కు తగి­నంత వి­శ్రాం­తి ఇవ్వా­ల­ని మే­నే­జ్‌­మెం­ట్ భా­వి­స్తోం­ది. బు­మ్రా ప్లే­సు­లో టీ20 స్పె­ష­లి­స్ట్ పే­స­ర్ అర్ష­దీ­ప్ సిం­గ్‌ తుది జట్టు­లో­కి వచ్చే అవ­కా­శా­లు మె­రు­గ్గా ఉన్నా­యి. అదే జరి­గి­తే ఆసి­యా­క­ప్‌ 2025లో అర్ష­దీ­ప్ సిం­గ్‌­కి ఒమ­న్‌­తో మ్యా­చే తొలి మ్యా­చ్ అవు­తుం­ది. ఈ మా­ర్పు మి­న­హా తుది జట్టు­లో మా­ర్పు­లు ఉం­డ­క­పో­వ­చ్చు. ఎం­దు­కం­టే టీ­మిం­డి­యా హె­డ్‌ కోచ్ గౌ­త­మ్ గం­భీ­ర్‌­కు పదే పదే తుది జట్టు మా­ర్చ­డం అస్స­లు ఇష్టం ఉం­డ­దు. అం­దు­కే వి­న్నిం­గ్‌ జట్టు­ను కొ­న­సా­గిం­చేం­దు­కే మొ­గ్గు చూ­పొ­చ్చు. కానీ బు­మ్రా­కు మా­త్రం దీని నుం­చి మి­న­హా­యిం­పు దొ­రి­కే అవ­కా­శం ఉంది. భారత జట్టు ప్ర­ధాన కోచ్ గౌ­త­మ్ గం­భీ­ర్ స్టై­ల్ ప్ర­కా­రం.. వి­న్నిం­గ్ జట్టు­నే కొ­న­సా­గిం­చే అవ­కా­శా­లు ఉన్నా­యి. అయి­తే, ఇప్ప­టి­వ­ర­కు కె­ప్టె­న్ సూ­ర్య­కు­మా­ర్ యా­ద­వ్, తి­ల­క్ వర్మ, శివం దూబే, అభి­షే­క్ శర్మ­ల­కు ఎలాం­టి వి­శ్రాం­తి ఉం­డ­క­పో­వ­చ్చ­ని తె­లు­స్తోం­ది. దీ­ని­పై తుది ని­ర్ణ­యం తీ­సు­కో­వా­ల్సి ఉంది.

బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో మార్పులు

రెం­డు మ్యా­చ్ ల్లో­నూ భా­ర­‌­త్ అద్భుత వి­జ­‌­యా­లు సా­ధిం­చి, టై­టి­ల్ ఫే­వ­‌­రె­ట్ పే­రు­కు న్యా­యం చే­సిం­ద­న­డం­లో ఎలాం­టి సం­దే­హం లేదు. ఇక ఈ రెం­డు మ్యా­చ్ ల్లో బ్యా­ట­‌­ర్లు అద్భు­తం­గా రా­ణిం­చా­రు. అయి­తే సంజూ శాం­స­‌­న్ స్థా­నం­లో ఓపె­న­‌­ర్ గా ప్ర­‌­మో­ష­‌­న్ పొం­దిన గిల్ ఆక­‌­ట్టు­కో­లే­క­పో­యా­డు. రెం­డు ఇన్నిం­గ్స్ ల్లో­నూ త‌ను త్వ­‌­ర­‌­గా ఔట­‌­య్యా­డు. ఈ క్ర­‌­మం­లో ఈ మ్యా­చ్ లో అత­‌­ని­కి రె­స్ట్ ఇచ్చే అవ­‌­కా­శ­‌­ముం­ది. దీం­తో ఓపె­న­‌­ర్ గా సంజూ బ‌­రి­లో­కి దిగే అవ­‌­కా­శ­‌­ముం­ది. అలా­గే మ‌రో బ్యా­ట­‌­ర్ గా ఫి­ని­ష­‌­ర్ రిం­కూ సిం­గ్ కు తుది జ‌­ట్టు­లో ఆడే అవ­‌­కా­శ­‌­ముం­ది. అలా­గే హా­ర్ది­క్ పాం­డ్యా­కు కూడా రె­స్ట్ ఇచ్చి, హ‌­ర్షి­త్ రా­ణా­ను ఆడిం­చే అవ­‌­కా­శా­ల­‌­ను తో­సి­పు­చ్చ­‌­లేం. ఇక సూ­ప­‌­ర్-4 షె­డ్యూ­ల్లో భా­గం­గా ఈనెల 21, 24, 26ల‌లో లీగ్ మ్యా­చ్ లు ఆడ­‌­నుం­ది. ఇం­దు­లో క‌­నీ­సం రెం­డు గె­లి­చి­న­‌­ట్ల­‌­యి­తే, ఫై­న­‌­ల్ కు చేరే అవ­‌­కా­శ­‌­ముం­ది. అయి­తే సూ­ప­ర్ 4లో పా­కి­స్థా­న్-భా­ర­త్ మరో­సా­రి తల­ప­డ­ను­న్నా­యి. ఈ మ్యాచుపై ఉత్కంఠ నెలకొంది.

Tags

Next Story