ASIA CUP: ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా

ASIA CUP: ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
X
మరోసారి షేక్ ఆడించిన అభిషేక్‌... బంగ్లాదేశ్‌పై టీమిండియా విక్టరీ... తొలుత 168 రన్స్ చేసిన భారత జట్టు

ఆసి­యా కప్‌­లో టీం ఇం­డి­యా ఫై­న­ల్‌­కు చే­రు­కుం­ది. బు­ధ­వా­రం జరి­గిన సూ­ప­ర్-4 మ్యా­చ్‌­లో భా­ర­త్ బం­గ్లా­దే­శ్‌­ను 41 పరు­గుల తే­డా­తో ఓడిం­చిం­ది. దు­బా­య్ ఇం­ట­ర్నే­ష­న­ల్ స్టే­డి­యం­లో 169 పరు­గుల లక్ష్యా­న్ని ఛే­దిం­చే క్ర­మం­లో బం­గ్లా­దే­శ్ జట్టు 19.2 ఓవ­ర్ల­లో­నే ఆలౌ­ట్ అయిం­ది. ఓపె­న­ర్ సైఫ్ హసన్ 69 పరు­గు­లు చే­శా­డు. 9 మంది బ్యా­ట­ర్స్ రెం­డం­కెల స్కో­రు­ను చే­రు­కో­లే­క­పో­యా­రు. కు­ల్దీ­ప్ యా­ద­వ్ 3 వి­కె­ట్లు పడ­గొ­ట్టా­డు. జస్ప్రీ­త్ బు­మ్రా, వరు­ణ్ చక్ర­వ­ర్తి చెరో 2 వి­కె­ట్లు పడ­గొ­ట్టా­రు. అక్ష­ర్ పటే­ల్ ఒక వి­కె­ట్ పడ­గొ­ట్టా­డు.

అభిషేక్ విధ్వంసమే

టాస్ ఓడి బ్యా­టిం­గ్‌­కు ది­గిన టీ­మిం­డి­యా­కు మంచి ఆరం­భ­మే దక్కిం­ది. మొ­ద­టి రెం­డు ఓవ­ర్ల­లో 10 రన్స్ మా­త్ర­మే చే­సిన ఓపె­న­ర్లు.. మూడో ఓవర్ నుం­చి గేర్ మా­ర్చా­రు. ముం­దు­గా శు­భ్‌­మ­న్ గిల్ రె­చ్చి­పో­గా.. ఆపై అభి­షే­క్ శర్మ ఊపం­దు­కు­న్నా­డు. ఈ ఇద్ద­రు దూ­కు­డు­గా ఆడ­టం­తో పవర్ ప్లే ము­గి­సే­స­రి­కి భా­ర­త్ 72/0తో ని­లి­చిం­ది. దాం­తో టీ­మిం­డి­యా భారీ స్కో­రు చే­సే­లా కని­పిం­చిం­ది. తర్వాత భా­ర­త్ వరు­స­గా వి­కె­ట్లు కో­ల్పో­యి కష్టా­ల్లో పడిం­ది. శి­వ­మ్ దూబె (2), సూ­ర్య­కు­మా­ర్ యా­ద­వ్ (5), తి­ల­క్ వర్మ (5) త్వ­ర­గా పె­వి­లి­య­న్ చే­రా­రు. హా­ర్ది­క్ పాం­డ్యా, అక్ష­ర్ పటే­ల్ (10 నా­టౌ­ట్) పరు­గు­లు చే­శా­రు. అభి­షే­క్‌ తాను ఎదు­ర్కొ­న్న తొలి 8 బం­తు­ల్లో 8 పరు­గు­లే చే­శా­డు. కానీ నా­లు­గో ఓవ­ర్‌ నుం­చి మోత మొ­ద­లైం­ది. నసు­మ్‌ బౌ­లిం­గ్‌­లో గి­ల్‌ వరు­స­గా 4, 6 బా­ద­గా.. అభి­షే­క్‌ లాం­గా­న్‌­లో సి­క్స్‌ దం­చే­శా­డు. అక్క­డి నుం­చి అభి­షే­క్‌ తగ్గే­దే­లే అన్న­ట్లు సా­గి­పో­యా­డు. ఏడో ఓవ­ర్లో ఓ భారీ షా­ట్‌ ఆడే ప్ర­య­త్నం­లో గి­ల్‌ క్యా­చ్‌ ఔట్‌ కా­వ­డం­తో 77 పరు­గుల వి­ధ్వం­సక భా­గ­స్వా­మ్యా­ని­కి తె­ర­ప­డిం­ది. సూ­ర్య (5), తి­ల­క్‌ వర్మ (5) వెం­ట­వెం­ట­నే ఔట్‌ కా­వ­డం టీ­మ్‌­ఇం­డి­యా­ను దె­బ్బ­తీ­సిం­ది. 17 పరు­గుల వ్య­వ­ధి­లో 3 వి­కె­ట్లు కో­ల్పో­యిన ఆ జట్టు.. 129/5తో ని­లి­చిం­ది. అక్ష­ర్‌ తో­డు­గా హా­ర్ది­క్‌ ఇన్నిం­గ్స్‌­ను నడి­పిం­చా­డు. జట్టు స్కో­రు­ను 170కి చే­రు­వ­గా తీ­సు­కె­ళ్లా­డు. అభి­షే­క్‌ ఔట­య్యాక 8.5 ఓవ­ర్ల­లో భా­ర­త్‌ 56 పరు­గు­లే చే­య­గ­లి­గిం­ది.


సైఫ్‌ హాసన్‌ ఒంటరి పోరాటం

బం­గ్లా ఛే­ద­న­లో ఓపె­న­ర్‌ సై­ఫ్‌ హా­స­న్‌ ఆటే హై­లై­ట్‌. మరో­వై­పు నుం­చి వి­కె­ట్లు పో­తు­న్నా ధా­టి­గా ఆడిన అతడు భా­ర­త్‌ కష్ట­ప­డే­లా చే­శా­డు. భారత ఫీ­ల్డ­ర్లు అనేక క్యా­చ్‌­లు వది­లే­య­డం అత­డి­కి కలి­సొ­చ్చిం­ది. బం­గ్లా­ను రెం­డో ఓవ­ర్లో­నే బు­మ్రా దె­బ్బ­తీ­శా­డు. ఓపె­న­ర్‌ తం­జి­ద్‌ (1)ను అతడు ఔట్‌ చే­శా­డు. బం­గ్లా 87/5కు పరి­మి­త­మై­నా భా­ర­త్‌­కు ధీమా ఉం­డ­లే­ని పరి­స్థి­తి. మరో­వై­పు సై­ఫ్‌ పో­రా­ట­మే అం­దు­కు కా­ర­ణం. అక్ష­ర్‌ ఓవ­ర్లో రెం­డు సి­క్స్‌­లు బా­దిన అతడు.. తన దూ­కు­డు­తో కలవర పె­ట్టా­డు. 17 ఓవ­ర్ల­లో బం­గ్లా 115/8తో ని­ల­వ­గా.. భా­ర­త్‌ పట్టు­బి­గిం­చిం­ది. సై­ఫ్‌ హస­న్‌­ను తర్వా­తి ఓవ­ర్లో­నే బు­మ్రా ఔట్‌ చే­య­డం­తో మ్యా­చ్‌ పూ­ర్తి­గా భా­ర­త్‌ చే­తు­ల్లో వచ్చిం­ది.

Tags

Next Story