Aus vs Eng : ఇంగ్లండ్ పై విజయం.. వన్డే సిరీస్ ఆసీస్ కైవసం
ఇంగ్లండ్ జట్టుతో జరిగిన ఐదో వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. బ్రిస్టల్ వేదికగా ఆదివారం జరిగిన ఐదో వన్డేలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.2 ఓవర్లలలో 309 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ సెంచరీతో ఆకట్టుకోగా, కెప్టెన్ బ్రూక్ 72 పరుగులు చేశాడు. ఆ తర్వాత 310 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 20.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఆ తర్వాత ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది.దాంతో మైదానం చిత్తడిగా మారింది. అంపైర్లు కాసేపు మ్యాచును నిలిపివేశారు. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్-లూయిస్ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియా విజయం సాధించినట్టు అంపైర్లు ప్రకటించారు.కంగారూల తరుపున అత్యధికంగా మాథ్యూ షార్ట్ 58 పరుగులు చేయగా, స్టీవ్ స్మిత్ 36 పరుగులు,హెడ్ 31 పరుగులు చేశారు. ఈ మ్యాచులో అల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న ట్రావిస్ హెడ్ కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. కాగా ఇరుజట్ల మధ్య జరిగిన టీ20 సిరీస్ 1-1తో సమమైన సంగతి తెలిసిందే.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com